https://oktelugu.com/

New Car: కొత్తగా కారు కొంటున్నారా? ఈ కార్లు మీకు బెస్ట్ ఆప్షన్లు.. ఎందుకంటే?

దేశంలో అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండేలా మారుతి కార్లు మార్కెట్లోకి వస్తాయి. యువత నుంచి సీనియర్ సిటీజన్స్ వరకు వివిధ మోడళ్లు మారుతి కంపెనీ నుంచి ఉన్నాయి. అయితే నేట యువత ఎక్కువా లగ్జీరీ లుక్ వచ్చేలా ఉంటూ లో బడ్జెట్ కలిగిన కార్ల గురించి సెర్చ్ చేస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2024 4:37 pm
    New car

    New car

    Follow us on

    New Car: భారత్ లో కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. సాధారణ వ్యక్తుల కంటే యువతే ఎక్కువగా కార్లు కొనుగోలు చేస్తున్నారు. చిన్న వయసులో ఉద్యోగం పొందిన వారు వెంటనే ఫోర్ వీలర్ వైపు మనసు పెడుతున్నారు. అయితే కారు కొనే సమయంలో తమ బడ్జెట్ కు అనుగుణంగా ఉపయోగపడుతుందా? అని లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం హ్యాచ్ బ్యాక్ వేరియంట్లు సొంతం చేసుకుంటున్నారు. అయితే వీటిలోనూ ‘వాల్యూ ఫర్ మనీ’ కార్లు ఉన్నాయా? లేవా? అని తెలుసుకుంటున్నారు. అయితే కొన్ని కంపెనీలు ఇలాంటి యువత కోసం కొన్ని మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వాటిలో మారుతి కంపెనీ ఇలాంటి కార్లు ఉన్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందాం..

    దేశంలో అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండేలా మారుతి కార్లు మార్కెట్లోకి వస్తాయి. యువత నుంచి సీనియర్ సిటీజన్స్ వరకు వివిధ మోడళ్లు మారుతి కంపెనీ నుంచి ఉన్నాయి. అయితే నేట యువత ఎక్కువా లగ్జీరీ లుక్ వచ్చేలా ఉంటూ లో బడ్జెట్ కలిగిన కార్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. వీటిలో మారుతి నుంచి అల్టో కే 10 కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ ఇందులో 1.0 లీటర్ పెప్పీ ఇంజిన్ తో నడుస్తూ ఇంధనాన్ని పొదుపు చరేస్తుంది. ఇందులో ఆధునిక ఫీచర్లు ఉండకపోచవ్చు. కానీ కొత్తగా కారు కొనేవారికి మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఇది మిగతా కార్ల కంటే తక్కువ బడ్జెట్ లో అందిస్తూ ఉపయోగంగా ఉంటుంది. ఆల్టో కె 10 రూ.3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్ష వరకు విక్రయిస్తున్నారు.

    మారుతి ఎస్ ప్రెస్సో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది హ్యాచ్ బ్యాక్ అయిన చిన్న కారు. కొత్తగా డ్రైవింగ్ చేసేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. దీంతో మైలేజ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. దఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉంది.

    మారుజతి సుజుకీ స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. దశాబ్దాలుగా దీని అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మే 9న స్విప్ట్ కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. అయితే కొత్తగా కారు కొనాలనుకునే యువత కొత్త స్విప్ట్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ కరు 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ మాన్యువల్ తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్ ను అందిస్తుంది.

    మారుతి నుంచే కాకుండా హ్యుందాయ్ కంపెనీ నుంచి గ్రాండ్ ఐ 10 నియోస్ యువతకు బెస్ట్ ఎంపిక అని అంటున్నారు. ఇందులో కేవల పెట్రోల్ లేదా కేవలం సీఎన్జీ ఆప్షన్లతో కారును కొనుగోలు చేయొచ్చు. అలాగే టాటా కంపెనీ నుంచి టియాగో గ్లోబల్ ఎన్సీఏపీ 4 స్టార్ రేటింగ్ తో కలిగి ఉంది. ఇది డ్రైవింగ్ కుమంచి అనుభూతిని ఇస్తుంది.