No planes fly there: ఇండిగో సంస్థలో ఏర్పడిన సంక్షోభం మన దేశ విమాన ప్రయాణికులకే కాదు, అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా నరకం చూపిస్తోంది. తాత్కాలికంగా ఏర్పడిన ఈ అంతరాయానికే దేశవ్యాప్తంగా గగ్గోలు ఏర్పడుతోంది. అసలు విమానాలు ఎగరని పరిస్థితి ఉంటే? విమానాశ్రయమే లేని తీరు ఉంటే? అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు? వారు విమాన యానం సాగించాలంటే ఎంతటి అవస్థలు పడి ఉంటారు? చదువుతుంటేనే ఆందోళన కలుగుతుంది కదా..
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం ఒకే విధంగా ఉండదు. భౌగోళికంగా కొన్ని ప్రాంతాలు సానుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటే.. మిగతా ప్రాంతాలు అత్యంత కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రాంతాలలో రవాణా వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విమానయానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాలలో టిబెట్ పీఠభూమి ఒకటి. ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉంటాయి. అందువల్లే విమానాలు నడవలేవు. టిబెట్ పీఠభూములు దాదాపు 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఇక్కడ ఒక్కో పర్వతం 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉండడంతో విమానం పనితీరు తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇంజన్ పనితీరు తగ్గిపోతుంది. ఎమర్జెన్సీలో ఫ్లైట్ ల్యాండ్ చేయడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ విమానాశ్రయాలు ఉండవు. వాతావరణ పరిస్థితులు వెంట వెంటనే మారిపోతుంటాయి. భారీగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈదురుగాలుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టిబెట్ పీఠభూమి ఉన్న ప్రాంతంలో ప్రజలు విమానయానం సాగించాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత.. అక్కడి విమానాశ్రయాలలో విమానాలలో ఎక్కి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.. మనదేశంలో తాత్కాలికంగా ఏర్పడిన సంక్షోభమే ఇంతటి ఇబ్బందికి కారణమైతే.. అసలు విమానాశ్రయం లేకపోతే.. విమానాలు ఎగరకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.