Winter: సాధారణంగానే చలికాలంలో శరీరం వణుకు పుడుతుంది. ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ధైర్యం చాలదు. ఉదయం సూర్యుడు రాకముందు నిద్ర లేవాలంటే మనసు ఒప్పుకోదు. అయినా కూడా కొందరు ఈ సమయంలో ఫ్యాన్ లేకుండా నిద్రపోరు. ఫ్యాన్ సౌండ్ ఉంటేనే కొందరికి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఎండకాలంలో అయితే చల్లదనం కోసం ఫ్యాన్ ఉపయోగిస్తుంటారు. కానీ చలికాలంలో ఫ్యాన్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
చాలామంది చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకొని నిద్రపోతూ ఉంటారు. కానీ ఇలా ఫ్యాన్ కింద నిద్రపోవడం ఎంత మాత్రం మంచిది కాదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగానే చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్ వేయడం వల్ల ఆ ప్రదేశంలో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ పొడి వాతావరణంతో ఉదయం లేవగానే గొంతు నొప్పి, దగ్గు రావడం, తలుపు వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొందరికి సైనస్ ప్రాబ్లం వల్ల ముక్కు బ్లాక్ అయిపోతుంది. పెదవులు పొడిబారిపోవడం, ముఖము చేతులు డ్రై అవ్వడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఒకేసారి మెడ పట్టేయడం.. భుజాల నొప్పి రావడం వంటి సమస్యలు ఉంటాయి. చలికాలంలో ఫ్యాన్ కింద నిద్రించడం వల్ల తలనొప్పి తీవ్రమౌతుంది. ఉదయం లేవగానే తల బరువుగా అనిపించడం వంటివి ఉంటాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, అస్తమా ఉన్నవారు, చలికి తట్టుకోలేని వారు చలికాలంలో ఫ్యాన్ వేసుకోకపోవడమే మంచిది.
అయితే అనుకోని పరిస్థితుల్లో ఫ్యాన్ కింద నిద్ర పోవాల్సి వస్తే.. ఆ తర్వాత పై సమస్యలు ఎదుర్కొంటే అప్పుడు వాటి పరిష్కారానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చని అంటున్నారు. చలికాలంలో బయట తిరగడం వల్ల చలి తీవ్రతకు కొంత డ్రై గా మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు వేడి నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే రాత్రి నిద్రించే సమయంలో ఫ్యాన్ కింద కాకుండా నిద్రించే ప్రదేశాన్ని మార్చుకోవాలి. ఒకవేళ ఫ్యాన్ తప్పనిసరి అని అనుకుంటే దుప్పటి కప్పుకోవాలి. స్వల్ప గాలి ప్రసరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఫ్యాన్ వేసుకోకపోవడమే మంచిది. కానీ ఫ్యాన్ లేకుండా నిద్రించలేం అనేవారు స్లో మోడ్లో ఏర్పాటు చేసుకొని నిద్రించాలి. అయితే ఫ్యాన్ ఉన్న గదిలో కాకుండా వేరే గదిలో నిద్రించే ప్రయత్నం చేయాలి. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు చలికాలంలో బయటకు రాకుండా ఉండడమే మంచిది.