Neelim Kumar Khaire: మనకు దూరం నుంచి పామును చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఒక వ్యక్తి 72 రకాల పాములను ఒక గదిలో ఉంచి మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చుని ఉన్నాడు. మొదట్లో ఈయన చేసే పరిశోధనకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. కానీ పాముల గురించి ఆయన చెప్పిన తర్వాత అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 72 గంటల పాటు ఆ గదిలో ఉండి పాముల గురించి అధ్యయనం చేశాడు. ఇంతకు ఆయన ఎవరు? అలా ఉండి పాముల గురించి ఏం తెలుసుకున్నాడు?
మహారాష్ట్రలోని పూణేకు చెందిన Herpatalogist నీలం కుమార్ కైరే అంతకుముందు అడవిలో ఉండే జీవరాశుల గురించి పరిశోధనలు చేసేవారు. కానీ పాముల గురించి తాను పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు. పాములకు ఎలాంటి హాని చేయకపోతే అవి కూడా ఏమీ చేయమని చెప్పాడు. దీనికి సంబంధించి ఒక పరిశోధన చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఒక గదిలో 72 రకాల పాములను ఉంచి.. అందులో 72 గంటలపాటు ఉన్నాడు. అయితే తన వద్దకు ఎలాంటి పాము వచ్చిన దానిని తీసి సున్నితంగా కిందకు వేశాడు. అంటే ఏ పాముకు హాని చేయకపోతే.. మనల్ని ఏ పాము ఏమి చేయదు అని ఆయన నిరూపించగలిగాడు.. ఇలాంటి సమయంలో కైరే గారి మనస్తత్వం గురించి మిగతా పరిశోధకులు పరిశీలించారు. అయితే కైరే అనుకున్నది సాధించాడు. 72 గంటలపాటు స్నేక్ గదిలో ఉండి సేఫ్గా బయటికి వచ్చాడు.
ఈ పరిశోధన చేసినందుకు అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కింది. ఆ తర్వాత ఫండ్స్ సేకరించిన కైరే 1986లో పూణేలో కాట్రాజ్ స్నేక్ పార్క్ ను ఏర్పాటు చేశారు. తన జీవితంలో ఎన్నో పరిశోధనలు చేసిన కైరే.. దేశంలో మొట్టమొదటిసారి పాముల పార్కును ఏర్పాటు చేశారు. అయితే పాములకు ఎలాంటి హాని చేయకపోతే.. అవి ఏ జంతువులను.. మనుషులను హాని చేయలేవని నిరూపించాడు.
అయితే పాములను సంరక్షించినందుకు ప్రభుత్వం సైతం అతనికి ఎన్నో రకాలుగా అవార్డులు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుత కాలంలో ఎక్కడైనా పాము కనిపిస్తే వెంటనే దానిని కొందరు చంపేస్తూ ఉంటారు. కానీ చాలావరకు పాములు తమపై దాడి చేస్తాయని భయంతోనే తిరగబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటికి హాని చేయకుండా ఉంటే అవి కూడా హాని చేయమని కైరే నిరూపించారు. అయితే కొందరు కావాలనే పాములపై దాడి చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకొని ప్రజల్లో తిప్పుతూ ఉంటారు. ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని జంతు నిపుణులు అంటూ ఉంటారు.