Laddu Auction: గణపతి నవరాత్రి వేడుకలు ఎంత గొప్పగా అయితే జరుగుతాయో.. స్వామివారి లడ్డువేలం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. కొంతమంది స్వామివారి చేతిలో లడ్డూను దక్కించుకోవడానికి వేలంలో పాల్గొంటారు. పోటాపోటీగా ధరను చెల్లిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలలో బాలాపూర్ లడ్డుకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ లడ్డును దక్కించుకోవడానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉంటారు. అవసరమైతే లక్షలు చెల్లించడానికి కూడా వెనకాడరు.
వారు లడ్డూలు కొనడం వెనక బలమైన కారణం ఉంది. ఎందుకంటే వినాయకుడి చేతిలో 9రోజుల పాటు పూజలు అందుకున్న లడ్డు అత్యంత పవిత్రమైనదని.. ప్రాశస్త్యమైనదని అందరు నమ్ముతుంటారు. అందువల్లే ఆ లడ్డును కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంటారు. లడ్డును కొనుగోలు చేసిన వారు దానిని తమ వ్యాపారాలలో ఉపయోగిస్తే రెట్టింపు లాభాలు వస్తాయని అమ్ముతుంటారు. సరిగ్గా గత ఏడాది హైదరాబాదులోని మై హోం భుజ లో ఓ వ్యక్తి భారీ ధరకు లడ్డు కొనుగోలు చేశాడు. అ లడ్డు దక్కించుకున్న తర్వాత.. ఈ ఏడాది ఏపీలో ఏకంగా నాలుగు వైన్ షాప్ లు సొంతం చేసుకున్నాడు.. ఈ ఏడాది కూడా అతడు భారీ ధరకు లడ్డు సొంతం చేసుకున్నాడు. తాను కొనుగోలు చేసిన లడ్డు ద్వారా ఇతర వ్యాపారాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నాడు.
ఇదే ప్రాంతంలో గత ఏడాది 20+ లక్షలకు లడ్డు వేలంలో కొనుగోలు చేయగా.. ఈ ఏడాది అది 50+ లక్షలను దాటింది. ఈ లడ్డును కొనుగోలు చేయడానికి చాలామంది వ్యాపారులు పోటీపడ్డారు. చివరి వరకు వేలం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఆ తర్వాత గత ఏడాది దక్కించుకున్న వ్యక్తే…ఈ ఏడాది కూడా లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం. గత ఏడాది దక్కించుకున్న లడ్డు ద్వారా అతడు నాలుగు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు . ఆ వైన్ షాపుల ద్వారా భారీగా లాభాలు వస్తున్న నేపథ్యంలో.. మరింత ఉత్సాహంతో ఈ ఏడాది లడ్డును దక్కించుకున్నాడు.. మరిన్ని వ్యాపారాలలో అడుగు పెడతానని అతడు పేర్కొంటున్నాడు. నిన్నటిదాకా బాలాపూర్ లడ్డుకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని మై హోం భుజ లడ్డు ఆక్రమించినట్టు తెలుస్తోంది.