Lalbaugcha Raja 2025 First Look: మరో రెండు రోజుల్లో వినాయక చవితి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు వినాయకుడు పూజలందుకుంటాడు. తొమ్మిది రోజులపాటు స్వామివారికి భక్తులు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు తీరైన నైవేద్యాన్ని సమర్పిస్తూ స్వామివారి సేవలో పాత్రధారులు అవుతారు. వినాయకుడి ఉత్సవాలను మనదేశంలో నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.. మనదేశంలో అత్యంత విశేష ఆదరణ ఉన్న గణపతి విగ్రహాలలో ముంబై లాల్ బాగ్ చా గణపతి విగ్రహం ముందు వరుసలో ఉంటుంది.
1934 నుంచి లాల్బాగ్ మార్కెట్లో ఈ గణపతి కొలువ తీరుతాడు. ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతుంటాయి. వివిధ రంగాలకు సంబంధించిన సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారి దర్శనానికి ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డిమాండ్ కు తగ్గట్టుగానే వీఐపీ పాస్ లను అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు భక్తులకు రకరకాల ప్రసాదాలు పెడుతుంటారు. అందువల్లే ఈ గణపతిని విశేష గణపతి అని పిలుస్తుంటారు.
బుధవారం నుంచి జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని.. లాల్బాగ్ గణపతిని నిర్వాహకులు అందరికీ చూపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. బంగారు, పసుపు వర్ణంలో గణపతి మెరిసిపోతున్నాడు. అతడిని ఖరీదైన నగలతో అలంకరించారు. విద్యుత్తు కాంతుల్లో గణపతి మరింత శోభాయ మానంగా కనిపిస్తున్నాడు. ఈ గణపతి కోసం భారీగా ఇన్సూరెన్స్ చేయించారు. హుండీ ద్వారా కూడా స్వామివారికి భారీగానే ఆదాయం వస్తుంది. ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం కావడం.. స్వామి వారు మహిమాన్వితుడు అవడంతో.. దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. లాల్బాగ్ గణపతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నది.
The first glimpse of Lalbaugcha Raja is here! ✨
The first look of the Lord Ganesha at Lalbagh Mumbai #LordGanesha
Ganpati Bappa Morya!#GaneshChaturthi #गणेश_चतुर्थी #HappyGaneshChaturthi#GanpatiBappaMorya #GaneshUtsav #GaneshFestival #Ganeshotsav2025 pic.twitter.com/WWP6jdErTx— TIger NS (@TIgerNS3) August 24, 2025