YS Jagan in Political trouble : 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన.. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాధిని చేసింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. రేవంత్ రెడ్డి పుణ్యమాన అదీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది. కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.
కానీ ఆంధ్రాలో ఈరోజుకు కూడా సమాధి నుంచి పైకి లేవడం లేదు. ఆరోజు కాంగ్రెస్ ఆంధ్రాలో స్ట్రాంగ్ బేస్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక ఏపీలో దళితులు, ఆదీవాసీలు, ముస్లింలు, ఇతర వర్గాలు కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఇందిరా గాంధీ గరీభీ హఠావో నినాదంతో ఏపీలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గారు.
అనాది నుంచి మాల, మాదిగలు క్రిస్టియన్ గా ఎక్కువ సంఖ్యలో ఏపీ మారారు. మత మార్పిడిలు చేసి దళితులను క్రిస్టియన్లుగా మార్చారు. నాయకత్వం రెడ్డి సామాజికవర్గం చేతుల్లోనే ఉండేది.కానీ విభజనతో ఏపీలో పుట్టగతులు లేకుండా కాంగ్రెస్ వైపు పోయింది. విభజనతో జగన్ వైపు ఈ కాంగ్రెస్ ఓటర్లు 2014లో బదలాయించారు.
కోర్ కాంగ్రెస్ ఓటర్ బేస్ మోడీ వ్యతిరేక హిందూయేతర ఓటు ఒకసారి జగన్ వైపు నిలబడ్డారు. కానీ జగన్ మోడీతో సన్నిహిత్యంతో గత సారి చంద్రబాబు వైపు వాళ్లు నిలబడ్డారు.
జగన్ తప్పుల్ని సొమ్ము చేసుకోలేని ఆంధ్ర కాంగ్రెస్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.