Pawan Kalyan Viral Tweet: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, మొదటి నుండి ఇప్పటి వరకు హీరో పాత్రలతోనే కొనసాగుతున్నాడు. చాలా మంది హీరోలు క్యారక్టర్ ఆర్టిస్టులుగా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత హీరోలు అయినా వాళ్ళే. కానీ బాలయ్య మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు మాస్, క్లాస్, యాక్షన్, ఫ్యాక్షన్, పీరియాడికల్ తదితర జానర్స్ లో హీరోగా సినిమాలు చేస్తూ ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు. అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. అయితే ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కాసేపటి క్రితమే ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బాలయ్య కి శుభాకాంక్షలు తెలియచేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నట వారసుడిగా, బాలనటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను గత తన నటనతో గత 50 సంవత్సరాల నుండి అలరిస్తూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) లో చోటు సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన ట్వీట్. సాధారణంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఎవరికైనా అభినందనలు, లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుండి, లేదంటే డిప్యూటీ CMO ఆఫీస్ హ్యాండిల్ నుండి కానీ ట్వీట్స్ వేయిస్తాడు. కానీ అందరూ ఆశ్చర్యపోయేవిధంగా తన వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ ట్వీట్ వెయ్యడం అందరినీ షాక్ కి గురి చేసింది.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 70వ పుట్టిన రోజుకి కూడా ఆయన జనసేన పార్టీ మరియు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ CMO ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్స్ వేయించాడు. అభిమానులు వ్యక్తిగత అకౌంట్ నుండి ఆ శుభాకాంక్షలు వచ్చి ఉండుంటే చాలా బాగుండేది అనుకున్నారు. ఆ విషయం లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ కి వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ నుండి వేయడం పై కొంతమంది మండిపడుతున్నారు. ఎంత పొత్తులో ఉంటే మాత్రం వాళ్లకు మరీ ఇంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటూ పవన్ కళ్యాణ్ ని నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వాడకం అంతంత మాత్రం గానే ఉంటుంది. ఆయన అందుబాటులో ఉన్నప్పుడు వ్యక్తిగత హ్యాండిల్ నుండి, అందుబాటులో లేనప్పుడు ఇతర ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి ట్వీట్స్ వేయిస్తూ ఉంటాడు అంటూ పవన్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో…
— Pawan Kalyan (@PawanKalyan) August 25, 2025