Motivational message: ఎవరైనా తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అయితే మిగతా వారి కంటే చాలా బాగుండాలని కోరుకునే వారు కూడా ఉన్నారు. కానీ ఎవరి పరిస్థితులు వారివి. ఎవరి బలం వారిది. ఇలాంటి అప్పుడు ఎవరికి వారు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. కానీ ఇతరులతో పోలుస్తూ తమకు కూడా అవే ఆనందాలు.. అదే జీవితం కావాలని కోరుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నీకున్న పరిస్థితులతో అందమైన జీవితం సమయానికి అనుకూలంగా వస్తుంది. అందుకోసం ఒక్కోసారి వెయిట్ చేయక తప్పదు. కానీ కొంతమంది తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనకూ ఓ సమయం వస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అవేంటంటే?
అనుకున్న వెంటనే ఆహారం దొరకాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆహారం అందాలంటే అందుకు ముందుగా తయారు చేసుకోవాలి. ఆహారం తయారు చేయడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయం కోసం వేచి చూడక తప్పదు. అలాగే కొన్ని పనులు కావాలంటే కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ సమయం గడిచేదాకా వెయిట్ చేయక తప్పని పరిస్థితి.
ఒక ఇంజనీరు కావాలంటే కనీసం ఐదేళ్లు సమయం పడుతుంది. ఒక డాక్టర్ కావాలంటే ఎనిమిదేళ్ల కాలం పడుతుంది. ఒక బిడ్డ జన్మించాలంటే 9 నెలలు ఆగాల్సిందే. ఇలా ముఖ్యమైన వాటికి సమయం కేటాయించినప్పుడు.. చిన్న చిన్న పనులు పూర్తి కావాలంటే కూడా వాటికోసం వెయిట్ చేయక తప్పదు. అలా కాకుండా వెంట వెంటనే పనులు కావాలంటే సాధ్యం కాదు. జీవితంలో ఏది ఎప్పుడు కావాలో అప్పుడే జరుగుతుంది.. అన్ని ముందే కావాలి అనుకుంటే.. ఆయుష్షు కూడా ముందే తీరిపోతుంది.
Also Read: తాగు ‘బోతు’ అంటే అర్థం ఇదా..? అరే.. ఇన్నాళ్లు తెలియలేదేం..?
కొంతమంది ఉద్యోగంలో చేరిన వెంటనే తమకు భారీ జీతం కావాలని కోరుకుంటారు. అందుకోసం ఒక కంపెనీలో ఉండగానే ఇతర కంపెనీలో వచ్చే ఆఫర్స్ కోసం ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటారు. అయితే కొత్తగా చేరే కంపెనీ పెద్దది అయి ఉండి… లేదా మంచి కంపెనీ అయితే పర్వాలేదు. కానీ కేవలం డబ్బు కోసమే ఇతర కంపెనీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే మాత్రం ఆ తర్వాత కెరీర్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉన్న ఉద్యోగంలో సామర్థ్యాన్ని చూపించిన తర్వాత ఇతర కంపెనీల కోసం చూడడం మంచి ఆప్షన్. అలాకాకుండా భారీగా జీతం వస్తుందని వెంటనే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అందులో నిజమైన ప్రతిభా చూపిస్తే.. మిగతా కంపెనీలు క్యూ కట్టి మరీ ఉద్యోగాలు ఇస్తాయి. అంటే దానికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయం కోసం వెయిట్ చేయక తప్పదు.
ఇక వ్యాపారం చేసేవారు ప్రారంభించగానే లాభాలు రావాలని ఆశించే వారు కొందరు ఉన్నారు. కానీ వ్యాపారం అభివృద్ధి కావాలంటే కనీసం ఏడాది పడుతుంది.. కొన్ని వ్యాపారాలు సంవత్సరాలు కూడా పడతాయి. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు. అందువల్ల ఏ విషయంలోనైనా ఓర్పు సహనంతో సమయాన్ని తీసుకోవాలి. అప్పుడే అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
View this post on Instagram