Most Expensive Teas: హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇటీవల నీలోఫర్ కేఫ్ ఏర్పాటయింది. అక్కడ లగ్జరీ పీపుల్ తాగే టీ ధర ₹1000. దీనికి పన్నులు అదనం. వాస్తవానికి నిలోఫర్ టీ నే చాలామంది అత్యంత ఖరీదు అనుకుంటారు. మస్కా బన్ కూడా అత్యంత కాస్ట్లీ అనుకుంటారు. కానీ వీటికి మించిన ఖరీదైన చాయ్ లు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇంతకీ అవి ఏంటో ఒకసారి తెలుసుకుందామా..
డా హాంగ్ పావో
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాయ్.. దీని తయారీకి ఉపయోగించే పౌడర్ కిలో ధర దాదాపుగా 10,57,80,000 ఉంటుంది. దీనికి ఈ స్థాయిలో ధర ఉండడానికి ప్రధాన కారణం.. టీ పౌడర్ ను తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు 350 సంవత్సరాలు కంటే ఎక్కువ పురాతనమైనవి. ఇచ్చట్లు పొగ మంచుతో కూడిన వాతావరణం లో ఉంటాయి. కొండ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంటాయి.. యాన్ యున్ అనే ప్రత్యేకమైన రుచి ఈ చెట్ల వల్ల వస్తుందట. పైగా మింగ్ అనే రాజవంశం ఈ టీని విపరీతంగా తాగేవారట. చైనా దేశంలో ఈ టీ పౌడర్ తయారు చేసే చెట్లను జాగ్రత్తగా చూసుకుంటారట.
పాండా డంగ్ టీ
పేరులోనే పాండాల వ్యర్ధాలు ఉన్నాయి. ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఈ చాయ్ ఎలా తయారు చేస్తారోనని.. పాండాల వ్యర్ధాలను సహజ ఎరువుగా మార్చి ఈ చెట్లను పెంచుతారు. పాండాలు కేవలం ఎదురు మాత్రమే తింటాయి కాబట్టి.. వాటి ఎరువులో రెట్టింపైన పోషకాలు ఉంటాయి. వాటి ఎరువును వేయడం వల్ల ఈ మొక్కలు బలంగా పెరుగుతుంటాయి. అందువల్లే ఈ టీ ని అత్యంత ఖరీదైనదిగా పేర్కొంటారు. బహిరంగ మార్కెట్లో కిలో టీ పౌడర్ ధర 61,70,500 వరకు ఉంటుంది.
డైమండ్ టీ బ్యాగ్
పేరులో ఉన్నట్టుగానే ఈ టీ బ్యాగ్ ను 2.56 క్యారెట్ల వజ్రాలతో అలంకరిస్తారు. ఆ బ్యాగు లోపల బంగారపు గొలుసు ఉంటుంది. దాంతోపాటు సిల్వర్ టిప్ టి ఆకులు ఉంటాయి.. ఒక్క టీ బ్యాగు ధర 13,22,250 వరకు ఉంటుంది.
నార్సిసస్ ఊలాంగ్
ఇది చైనాలో తయారయ్యే టీ పౌడర్. దీని ధర కిలో 6,31,643 ఉంటుంది.. గ్రీకు పురాణాల్లో నార్సిపస్ అనే పేరును దీనికి పెట్టారు. ఈ టీ పౌడర్ చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. చాయ్ కి గొప్ప రుచి అందిస్తుంది. దీని బలమైన సువాసన ఇట్టే ఆకట్టుకుంటుంది.
టైగ్వానిన్
చైనాలో తయారుచేసే ఈ టీ పౌడర్ కిలో ధర 2,91,489 వరకు ఉంటుంది. ఈ తేయాకు మొక్కలను 1800 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఈ మొక్కలను కరుణామయి అయిన దేవత అని పిలుస్తుంటారు. ఆకులు సేకరించడం.. వాటిని ఎండబెట్టడం.. శుద్ధి చేయడం.. ఈ ప్రక్రియలు అత్యంత కఠినమైనవి. అందువల్లే ఈ టీ పౌడర్ అత్యంత విలువైనదిగా పేరుపొందింది.