Hyderabad Woman: ప్రియుళ్ళ మోజులో పడి.. భర్తలను అంతం చేస్తున్న భార్యలు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. ఏ ముహూర్తంలో అయితే మేఘాలయ సంఘటన వెలుగులోకి వచ్చిందో.. అప్పటినుంచి భర్తలను అంతం చేస్తున్న భార్యలు పెరిగిపోతున్నారు. అయితే ఇందులో ఒక్కో నేరానికి ఒక్కో నేపథ్యం ఉంది. కానీ అంతిమంగా బలైంది మాత్రం భర్తలే. అలా భార్య చేతిలో ఓ భర్త అంతమయ్యాడు. అన్ని స్టోరీల మాదిరిగానే ఈ స్టోరీలో కూడా వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడి కోసం ఈ భార్య ఏకంగా భర్తను అంతం చేసింది. అయితే ఈ స్టోరీలో సినిమాకు మించిన మలుపులు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ ప్రాంతం పోలీస్ స్టేషన్లో దారుణం జరిగింది. సరూర్నగర్ లోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ 7 లో చిట్టి, శేఖర్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. చిట్టి, శేఖర్ కు చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే మొదట్లో వీరి సంసారం బాగానే ఉండేది. ఆ తర్వాతే వీరి సంసారం లో అనేక మార్పులు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్యలోకి హరీష్ అనే వ్యక్తి వచ్చాడు. హరీష్ తో చిట్టి కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే వీరిద్దరి వ్యవహారం శేఖర్ కు తెలిసింది. దీంతో వ్యవహార శైలి మార్చుకోవాలని భార్యకు సూచించాడు. కానీ ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టింది. దీంతో ఎలాగైనా సరే శేఖర్ అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే శేఖర్ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అతడు పడుకున్న వెంటనే ప్రియుడిని పిలిపించింది. ఇద్దరు కలిసి అతడిని హత్య చేశారు.
ఉదయం డయల్ 100 కు చిట్టి ఫోన్ చేసింది. నిద్రలోనే తన భర్త చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెబుతున్న మాటలు.. క్షేత్రస్థాయిలో జరిగిన దానికి సంబంధం లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు వారిదైన శైలిలో విచారించారు. దీంతో చిట్టి తాము చేసిన నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు అంతకంటే ముందు అనేక కోణాలలో విచారించినప్పటికీ చిట్టి తను చేసిన నేరాన్ని ఒప్పుకోలేదు. అంతేకాదు మహానటి రేంజ్ లో తన నటన కౌశలాన్ని ప్రదర్శించింది. పోలీసులు తమ విధానంలో విచారిస్తే నిజం ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హరీష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.