Tragedy in Allu Arjun family: అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నాన్నమ్మ, అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు కనకరత్నమ్మ(Allu Kanaka Ratnamma) నేడు తెల్లవారు జామున కన్నుమూసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లో ముంచేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె వయస్సు 94 ఏళ్ళు. గత రెండు మూడు నెలల నుండి తీవ్రమైన అశ్వాసతతో ఉంది. అల్లు కుటుంబం హాస్పిటల్ లో చేర్చి మెరుగైన వైద్యం అందించి ఆమె ప్రాణాలను తాత్కాలికంగా కాపాడగలిగారు. అయితే నేడు ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచింది. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్ తమ షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి వెంటనే ఇంటికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ఆయన సతీమణి సురేఖ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్,చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత, ఇలా అందరూ ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉన్నారు.
మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చారు కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మరియు నాగబాబు(Konidela Nagababu) మాత్రం రాలేదు. వీళ్లిద్దరు ప్రస్తుతం వైజాగ్ లోని జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం లో ఉన్నారు. గత రెండు రోజుల నుండి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. భారీ బహిరంగ సభ ని ఏర్పాటు చేశారు. నేడు సాయంత్రం ఈ సమావేశం జరగనుంది. వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరళి రాబోతున్నారు. అందుకే నేడు పవన్ కళ్యాణ్, నాగబాబు రాలేకపోయారని టాక్. అయితే పవన్ కళ్యాణ్ కి బదులుగా ఆయన సతీమణి అన్నా లెజినోవా వచ్చింది. పవన్ కళ్యాణ్, నాగబాబు రేపు అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అల్లు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ రాకపోవడం పై కొంతమంది తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
చనిపోయిన వారిని చూసేందుకు కూడా సమయం లేదా, సభ ఈరోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు కదా,చివరి చూపు చూసేందుకు కూడా రాకపోతే ఇక ఎందుకు?, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యినప్పుడు కూడా ఆయన రాలేదు. చూస్తుంటే అల్లు కుటుంబం తో పవన్ కళ్యాణ్ కి చాలా గట్టి గొడవలే ఉన్నాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ కూడా ఇంకా అల్లు అర్జున్ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆయన కూడా వస్తాడా లేదా అనే డైలమా లో ఉన్నారు ఫ్యాన్స్. ఒకవేళ రామ్ చరణ్ కూడా రాకపోతే కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో బలమైన వివాదం జరుగుతుందనే అనుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ రేపు నిజంగా వచ్చి పరామర్శిస్తే మాత్రం సోషల్ మీడియా లో కాస్త నెగిటివిటీ తగ్గుతుంది అనుకోవచ్చు.