Monsoon Snake Safety Tips: ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం కూడా చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో క్రిమి కీటకాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక పాముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి వెచ్చని ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటాయి. వాటిలో ఆవాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తుంటాయి. ఆ సమయంలో వాటిని కదిపే ప్రయత్నం చేస్తే.. లేదా ప్రమాదవశాత్తు తొక్కితే సర్పాలు కాటు వేస్తాయి.
వర్షాకాలంలో వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. వర్షాలు కురుస్తాయి కాబట్టి కొన్ని రకాల జంతువులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆహారం కోసం బయటికి వస్తుంటాయి. ఈ సమయంలో అవి వెచ్చగా ఉన్న ప్రాంతాలను ఆవాసంగా చేసుకుంటాయి. అందులోనే అవి సేద తీరుతుంటాయి. అలాంటి చోటకి పొరపాటున వెళితే.. ఒకవేళ ప్రమాదవశాత్తు వాటి మీద గనుక మన అడుగుపడితే కాటు వేస్తాయి. పాములలో విషం అధికంగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో వాటిల్లో విష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అవి గనుక కాటు వేస్తే ప్రాణాలకు ప్రమాదం. సకాలంలో ఆసుపత్రి తీసుకెళ్లకపోతే జరగకూడని ఘటన జరుగుతుంది. అందువల్లే వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలి. పాములు రాకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు కిటికీలకు జాలిల వంటివి ఏర్పాటు చేసుకోవాలి. సర్పాలు లోపలికి రాకుండా చూసుకోవాలి.. మరుగునీరు నిల్వ ఉంటే కప్పల వంటివి వస్తాయి కాబట్టి సాధ్యమైనంతవరకు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
Also Read: Danger snake : వాతావరణాన్ని, ప్రాంతాన్ని బట్టి విషాన్ని మార్చే డేంజర్ పాము?
ఇక ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్రిమి కీటకాల సంచారం అధికమైంది. పాములు కూడా కనిపిస్తున్నాయి. పాములు మాంసాహారులు కాబట్టి.. ఆహార అన్వేషణకు బయటికి వస్తాయి. ఆ సమయంలో కీటకాలను, కప్పలను పట్టుకొని తినేస్తుంటాయి. అయితే వర్షాకాలంలో వాతావరణం అత్యంత తేమగా ఉంటుంది. నేల కూడా తడిగా ఉంటుంది. ఈ సమయంలో పాములకు వెచ్చటి ఆవాసం కావలసి ఉంటుంది. అటువంటి ఆవాసాలలో అవి తల దాచుకుంటాయి. తమిళనాడు రాష్ట్రంలో కడదురు జిల్లాలో చావడి అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన బూట్లను సురక్షితమైన ప్రాంతంలో ఉంచాడు. అయితే అందులోకి ఒక పాము చేరింది. అతడు షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. అందులో పాము కదులుతూ కనిపించింది. వెంటనే భయపడిన ఆ వ్యక్తి ఈ విషయాన్ని పాములు పట్టే వ్యక్తికి చెప్పాడు. దీంతో అతడు వచ్చి అత్యంత జాగ్రత్తగా ఆ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న అడవిలో వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ” వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాము నేను భద్రపరచుకున్న బూట్ల లోకి వచ్చింది. నేను బూట్లు వేసుకోవడానికి ప్రయత్నించగా అందులో అది కదులుతూ కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందిస్తే.. అతడు దానిని పట్టుకొని అడవిలో వదిలేసాడని” ఆ వ్యక్తి వెల్లడించాడు.
View this post on Instagram