Nagarjuna Villain Role In Coolie Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినప్పటికి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగార్జున (Nagarjuna) నుంచి చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ రావడం విశేషం. చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఆయన హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల (Shekar kammula) డైరెక్షన్లో వచ్చిన కుబేర (kubera) సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించిన నాగార్జున..ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక దీంతో పాటుగా రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraj) కాంబినేషన్లో వస్తున్న కూలీ (Cooli) సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. మరి నాగార్జున ఇలాంటి ఒక డిసిజన్ తీసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలాంటి భేషజాలు లేకుండా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకున్న ఇష్టాన్ని చెబుతున్నాడు. ఎంతసేపు హీరో గానే చేయాలంటే కష్టం. డిఫరెంట్ పాత్రలు దొరక్కపోవచ్చు. హీరో అంటే సాఫ్ట్ కార్నర్ తో ఉంటాడు కాబట్టి అలాంటి పాత్రలను పోషించాల్సి ఉంటుంది. అలా కాకుండా నటుడు అంటే విభిన్నమైన పాత్రలను పోషించాలి. అలాంటప్పుడే పరిపూర్ణమైన నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. కాబట్టి నాగార్జున ఇప్పుడు విలన్ పాత్రలను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట నాగార్జున మరిన్ని డిఫరెంట్ పాత్రలను చేయడానికి ట్రై చేస్తే బాగుంటుందని చాలామంది సినిమా మేధావులు చెబుతున్నారు.
ఇక మరికొంతమంది మాత్రం నాగార్జున ఇలాంటి రూట్ తీసుకోవడం వల్ల ఆయన కెరీర్ కి ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అలాంటిదేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జునకి కూడా పెద్దగా మార్కెట్ అయితే ఏమీ లేదు.
కాబట్టి ఆయన మార్కెట్ కు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ లను ఎంచుకుంటున్నాడు. అతను ఇంకా ముందు చేయబోయే సినిమాల్లో సోలో హీరోగా ట్రై చేసి మరి సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక తన తోటి హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు సోలో హీరోగా చేసుకుంటూ వాళ్ళ సత్తా చాటుతుంటే ఈయన మాత్రం విలన్ నటిస్తుండటం అతని అభిమానుల్లో కొంతవరకు నిరాశను కలిగిస్తుంది…