Miyazaki Mango: కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో మామిడి చెట్లకు కాయలు అంతంతమాత్రంగానే కాశాయి. కాకపోతే అవి గులాబీ రంగులో ఉన్నాయి. ఆ చెట్లకు కాపలాగా.. కుక్కలను ఉంచారు. మామిడి పండ్లకు కాపలాగా మనుషులను ఉంచడం సర్వసాధారణం. కానీ కుక్కలను ఉంచడం అరుదైన విషయం. అంతేకాదు. పైగా ఆ మామిడి తోట చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా ఎందుకు అనే ప్రశ్న మీలో ఉత్పన్నమవుతున్నది కదా.. ఎందుకంటే ఆ మామిడి తోటలో కేజీఎఫ్ లాంటి కాయలు ఉన్నాయి మరి. అందుకే ఆ తోట యజమాని అటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు.
Also Read: 39 రూపాయలు పెట్టి డ్రీమ్11లో ఆడి 4 కోట్లు గెలిచిన యువకుడు
మియా జాకీ మొక్కలు నాటారు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఖమ్మం రూరల్ మండలంలోని బారు గూడెం ప్రాంతంలో ప్రముఖ వ్యాపారవేత్త, రైతు గరికపాటి వెంకట్రావు శ్రీ సిటీ ప్రాంతంలో మియా జాకీ అనే మామిడి మొక్కలను నాటారు. కరోనా సమయంలో జపాన్ ప్రాంతం నుంచి ఆయన ఒక్కో మొక్కను పదివేల చొప్పున కొనుగోలు చేసి.. మొత్తం 15 మొక్కలు నాటించారు. అందులో ఐదు మొక్కలు చనిపోయాయి. ఆ పది మొక్కలకు గత ఏడాది పది కాయలు కాశాయి. ఈసారి మాత్రం ఒక్కో మొక్క పర్వాలేదు అనే స్థాయిలో కాయలు కాచింది. వీటికి బహిరంగ మార్కెట్లో కిలో ధర వచ్చేసి 2.50 లక్షల ధర పలుకుతున్న నేపథ్యంలో.. గరికపాటి వెంకట్రావు ఆ మొక్కలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ మొక్కల కాయలకు కాపలాగా కుక్కలను ఉంచారు. ప్రస్తుతం ఈ మామిడి కాయలు పక్వానికి రావడంతో వాటిని.. జపాన్ దేశానికి ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది మరో 60 మొక్కలను ఆయన జపాన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. వాటిని కూడా నాటారు..
బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్
మియాజాకి మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటి ధర లక్షలు పలుకుతుంది. మియాజాకి పండ్లను జపాన్ దేశానికి ఎగుమతి చేస్తున్నట్టు గరికపాటి వెంకట్రావు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తోటలో పండ్లు పక్వానికి వచ్చాయి. త్వరలోనే ఈ పండ్లను కోసి.. ప్రత్యేకమైన పద్ధతిలో నిల్వ ఉంచి.. జపాన్ దేశానికి ఎగుమతి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ పండ్లను దొంగలు దొంగిలించకుండా ఉండడానికి ప్రత్యేకంగా కుక్కలను కాపలాగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతేకాదు ఆ మొక్కల చుట్టూ ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు వెంకట్రావు పేర్కొన్నారు. మియా జాకీ మొక్కలు ఏపుగా పెరగడానికి జపాన్ తరహా లోనే వాతావరణాన్ని సృష్టించామని.. అందువల్లే ఈ దిగుబడి సాధ్యమవుతుందని గరికపాటి వెంకట్రావు వెల్లడించారు.
Also Read: ఎంత ట్రోలింగ్ చేస్తే.. అంత ఆదాయం.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్కూ!