Jalsa and Yamadonga : టాలీవుడ్ లో ఒక ఆసక్తికరంగా పోరు అతి కొద్దిరోజుల్లోనే జరగనుంది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) సినిమాలు కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి. ఆ రెండు సినిమాలు కొత్త సినిమాలు కావండోయ్, వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న సమయంలో ఈ ఇద్దరి హీరోల కెరీర్స్ ని మలుపు తిప్పే రేంజ్ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన ‘జల్సా'(#JalsaReRelease), ‘యమదొంగ'(#YamadongaReRelease) చిత్రాలు విడుదల కాబోతున్నాయి. జల్సా చిత్రం మే 16 న విడుదల కాబోతుండగా, యమదొంగ చిత్రం మే 18 న విడుదల కాబోతుంది. మే20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 8K వెర్షన్ లోకి మార్చి రీ రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ‘జల్సా’ విషయానికి వస్తే 2022వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి స్పెషల్ షోస్ వేశారు.
Also Read : ‘హరి హర వీరమల్లు’ కి పోటీగా ‘జల్సా’ రీ రిలీజ్..పవన్ ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అల్లు అరవింద్!
ఈ స్పెషల్ షోస్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ రికార్డుగా నిల్చింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ సినిమాని మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తుంది అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింహాద్రి చిత్రం తర్వాత ఎన్టీఆర్ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకొని కెరీర్ ముగిసిపోతుందేమో అనే రేంజ్ కి పడిపోతున్న సమయంలో వచ్చిన చిత్రమిది. అప్పటి వరకు లావుగా కనిపించిన ఎన్టీఆర్ ఈ చిత్రం తో సన్నబడి కనిపించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.
ఇక జల్సా విషయానికి వస్తే ‘ఖుషి’ తర్వాత పవన్ కళ్యాణ్ కి తన రేంజ్ సూపర్ హిట్ పడడం లేదు. అభిమానులు డీలాపడిన సమయంలో విడుదలైన ఈ చిత్రానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వద్ద చెరో 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. టాలీవుడ్ లో పోకిరి తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే. అలా ఆరోజుల్లో ఈ ఇద్దరి హీరోలకు కం బ్యాక్ గా నిల్చిన ఈ రెండు చిత్రాలు, దాదాపుగా సరిసమానమైన వసూళ్లను రాబట్టి సెన్సేషన్ ని సృష్టించాయి. ఇప్పుడు రీ రిలీజ్ కూడా సరిసమానమైన వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఈ వారం లోనే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. ఏ చిత్రం విజేతగా నిలుస్తుందో చూడాలి.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన ‘యమదొంగ’..’గబ్బర్ సింగ్’ రికార్డ్స్ బద్దలు కానున్నాయా?