Aadipurush : ఒకప్పుడు బాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఆరోజుల్లో ఈ సినిమాలు చాలా పెద్ద సూపర్ హిట్స్ అయ్యాయి. అత్యధిక శాతం ఈయన మల్టీస్టార్రర్ సినిమాలే చేస్తూ వచ్చాడు. అదే విధంగా లవ్ స్టోరీస్ కి ఇతను కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన హీరో గా నటించిన ‘లవ్ ఆజ్ కల్’ చిత్రం ఆరోజుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా ఇక్కడ పెద్ద హిట్ అవ్వలేదు. ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘ఆదిపురుష్'(AdiPurush), ‘దేవర'(Devara Movie) చిత్రాల ద్వారా పరిచయం అయ్యాడు.
Also Read : ‘ఆదిపురుష్’ 13 రోజుల వసూళ్లు..ఆ ప్రాంతం లో జీరో షేర్స్?
రీసెంట్ గా ఈయన బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన కొడుక్కి ఆదిపురుష్ చిత్రాన్ని చూపించిన తర్వాత క్షమాపణలు చెప్పానని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మాటలకు నొచ్చుకున్నారు. ఈ చిత్రం లో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ ‘నేను ఆదిపురుష్ చిత్రం లో విలన్ గా నటించిన సంగతి మీ అందరికీ తెలుసు. గంభీరమైన స్వరంతో అందరి పై అరుస్తూ యుద్ధం చేస్తూ ఉంటాను. ఈ సినిమాని చూసిన నా కొడుకు, నన్ను ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అడిగితే సరే అన్నాను. కానీ ఆదిపురుష్ లో విలన్ గా నటించినందుకు మాత్రం క్షమాపణలు చెప్పాను. ఇంతకు మించి మీరు అనుకుంటున్నది ఏమి కాదు. నేను చేసిన ప్రతీ సినిమాని ఎంతో గౌరవిస్తాను, ఆదిపురుష్ చిత్రం కి నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన స్పష్టత ఇస్తూ ‘నేను నా సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో భిన్నమైన క్యారెక్టర్స్ చేసాను. నా కొడుకు తైమూర్ నువ్వు హీరోనా..? విలనా? అని అడిగేవాడు, అప్పుడు మూడు గంటల నిడివి ఉన్న ఆదిపురుష్ చిత్రాన్ని చూపించాను. ఆ సినిమా చూసిన తర్వాత మావాడి నుండి ఎలాంటి స్పందన రాలేదు, ఆ తర్వాత కోపంగా నావైపు చూసాడు. దీంతో నేను క్షమాపణలు’ చెప్పాల్సి వచ్చింది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. గత ఏడాది ‘దేవర’ చిత్రం తో మన ముందుకొచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన ‘దేవర 2’ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లు, బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు.
Also Read : ‘ఆదిపురుష్’ డైలాగ్స్ మొత్తం మార్చేస్తున్నారా..! సంచలన ప్రకటన చేసిన నిర్మాతలు