https://oktelugu.com/

Minister Prahlad Singh Patel: వేప చెట్టుకు మామిడికాయలు.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమౌతోంది.. కేంద్రమంత్రి కీలక ట్వీట్..

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు.

Written By: , Updated On : May 27, 2024 / 10:08 AM IST
Prahlad Singh Patel bungalow juicy mangoes hanging on neem tree

Prahlad Singh Patel bungalow juicy mangoes hanging on neem tree

Follow us on

Minister Prahlad Singh Patel: “ఆవు పాలు పంది తాగుతుంది. శ్రీశైలం మల్లన్న నంది ఎగురుకుంటూ వస్తుంది. రక్తం కక్కుకుంటూ జనం చస్తారు. ఆకాశంలో ధృవతార ఒకటి మెరుస్తుంది. అది క్రమంగా పెరిగి భూ మండలాన్ని నాశనం చేస్తుంది.. వేప చెట్టుకు మామిడి కాయలు కాస్తాయి” చదువుతుంటే.. బ్రహ్మంగారి కాలజ్ఞానం గుర్తుకొస్తోంది కదూ.. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఎప్పుడో ఈ కాలజ్ఞానం రాసినప్పటికీ.. అది స్మరణకు వస్తే చాలామంది కొట్టి పారేస్తారు.. అలా జరగదని వాదిస్తుంటారు. కానీ, కేంద్రమంత్రి చేసిన ట్వీట్ బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే అని నిరూపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ప్రకారం ఒక వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు కాచి కనిపించాయి. దాదాపు 25 వరకు మామిడికాయలు ఆ వేప కొమ్మలకు ఉన్నాయి. ఇది ఆయనకు వింతగా తోచింది. దీంతో ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది. ఈ వీడియో చూసిన చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ వేపచెట్టు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి మామిడి చెట్టు ఆనవాళ్లు లేవు. దీంతో ఆ వేపచెట్టు కాచిన మామిడికాయలను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం అక్కడి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు తెలియడంతో ఆ చెట్టును పరిశీలించారు. చెట్టు మొత్తం ఎక్కి తదేకంగా చూశారు. అయితే ఆ చెట్టు మొదట్లో మామిడి చెట్టు ఉందట. ఆ చెట్టు వేప చెట్టుతో పోల్చితే చిన్నగా ఉందట. ఆ మామిడి చెట్టు పూతకు వచ్చినప్పుడు.. ఆ పూత లోని పుప్పొడి రేణువులు వేప చెట్టు కొమ్మలపై పడ్డాయట. అలా వేపచెట్టు మామిడికాయలు కాచిందట. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” ఈ దృశ్యాన్ని చూసి నా మనసు పులకరించిపోయింది. బహుశా ఈ స్థాయి ఘనతకు కారణం మా తోటమాలి అయి ఉంటాడు. అతడే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాడు. వేప చెట్టుకు మామిడికాయలు అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదని” కేంద్రమంత్రి రాసుకొచ్చాడు..