Birds Mimicry: పక్షుల మిమిక్రీ.. వింటే ఆశ్చర్య పోవాల్సిందే..

చిలుకలు, మైనా జాతి పక్షులు మనుషులను అనుకరిస్తాయి. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇస్తారు. అవి పక్షుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారం బహుమతిగా ఇస్తారు.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 3:40 pm

Birds Mimicry

Follow us on

Birds Mimicry: మిమిక్రీ.. అంటే అనుకరించడం. ఇది కూడా ఒక కళే.. వీఐపీలు, సినిమా నటుల గొంతులను అనుకరించడం, జంతువులు, పక్షుల అరుపులు, కూతలను మనిషి గొంతు నుంచి వినిపించడం మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవన్నీ మనిషి చేసేవే. అయితే ఇక్కడ పక్షులు కూడా మిమిక్రీ చేస్తున్నాయి. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ అరుదైన పక్షులు అండమాన్‌ దీవుల్లో ఉన్నాయి.

రకరకాల శబ్దాలు చేసే రాకెట్‌ టైల్డ్‌ డోంగ్రీ..
వీటి మిమిక్రీ వింటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది. అండమాన్‌లోని తోకల ఏట్రింత(రాకెట్‌ టైల్డ్‌ డ్రోంగీ) రెండు రకాల శబ్దాలు చేస్తుంది. ఒకసారి సముద్రపు గద్దలా, మరోపారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హారన్‌ శబ్దాలు చేస్తుంది. ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతుంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడడం కోసం వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఇతర పక్షులు తమ ఆహారం తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా ఉంటాయట. ఏదైనా పక్షి వస్తే దానిపై మూకుమ్మడిగా దాడి చేస్తాయట. ఏట్రింతలు జాలె డేగలా కూడా అరుస్తాయట.

చిలుకలు, మైనా జాతి పక్షులు..
ఇక చిలుకలు, మైనా జాతి పక్షులు మనుషులను అనుకరిస్తాయి. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటి నుంచే తర్ఫీదు ఇస్తారు. అవి పక్షుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారం బహుమతిగా ఇస్తారు. ఇలా మాటలు నేర్పిస్తారు. చిలుకలు వాక్యూమ్‌ క్లీనర్‌ చేసే శబ్దాన్ని, టెనిఫోన్‌ రింగ్, కుక్క అరుపులను కూడా అనుకరిస్తాయి. ఐన్‌స్టీన్‌ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్సి్వల్లె జూలోని తోడేళ్లు, చింపాంజీలు, కోళ్లు, పులులు ఇతర జంతువుల అరుపులను అనుకరించేంది.

ఆస్ట్రేలియాలో ఇలా..
అడవుల్లో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకునేందుకు ఒకదానినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్‌ విశ్వవిద్యాలయంలోని లారా కెల్లీ తెలిపారు. అవే చిలుకలను పంజరంలో బంధిస్తే వాటి సమీపంలోని మనుషులను కూడా అనుకరిస్తాయని తెలిపారు. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకు చెందిన లైర్‌ బర్డ్‌ చాలా ప్రముఖమైన పక్షి. ఈ పక్షి కార్‌ రివర్స్‌ శబ్దాన్ని, కెమెరా క్లిక్‌ శబ్దాన్ని, చైన్‌ సా, చెట్టు పడిపోయే శబ్దాన్ని తుపాకీ, వాద్య పరికరాలు, ఫైర్‌ అలారం, పసి పాపల ఏడుపు, రైళ్లు, మనుషులు ఈ విధంగా అనేక రకాల శబ్దాలను అనుకరిస్తాయి.

ఆడ పక్షుల కోసం..
ఇక మగ పక్షలు ఆడ పక్షులను అనుకరించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తుంటాయి. ఆడ పక్షులు ఏ మగ పక్షి ఎక్కువ శబ్దాలను అనుకరిస్తోందో దానిని భాగస్వామిగా ఎంచుకుంటాయని పక్షి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐరోపా జీవ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఎటవంటి ఆధారం దొరకలేదంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణతో ఎటువంటి ఉపయోగం ఉండదని, అది కేవలం సాధన మాత్రమే అని పేర్కొంటున్నారు.

ఆఫ్రికా ఎడారిలో..
ఇక ఆప్రికాలోని కలహారి ఎడారిలో జీవించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారం సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారం తీసుకుంటున్నపుపడు ఘాతుక పక్షులు లేదా వాటిపై దాడిచేసే ఇతర జంతువుల అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలు విన్న జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్లిపోతాయి. వెంటనే ఏట్రింతలు ఆహారం ఎత్తుకెళ్తాయి.