Man Creates Forest For Animals: సెంటు భూమి కనిపిస్తే అందులో ఉన్న చెట్లను నరికివేసి పెద్దపెద్ద భవనాలు కట్టుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి పేరు చెబుతూ చెట్లను నరికి వేస్తుంటారు… కానీ మళ్ళీ చెట్లు పెంచడానికి చాలామంది ముందుకు రారు. కానీ పర్యావరణం పై అధికమైన ప్రేమను పెంచుకొని.. ప్రకృతి ప్రసాదించిన అడవులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఓ వ్యక్తి తనకున్న మొత్తం పొలంలో చిన్నపాటి అడవిని తయారు చేశాడు. అయితే ఈ అడవిని తన సొంతానికి వాడుకోకుండా కేవలం పక్షులు, జంతువులు ఆశ్రయం పొందడానికి కేటాయించారు. అయితే ఆ అడవిని సృష్టించిన వ్యక్తి గురించి తెలుసుకోవాలన్న తపన చాలామందికి ఉంటుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే?
సాధారణంగా ఎవరికైనా భూమి ఉంటే అందులో వ్యవసాయం చేస్తూ ఉంటారు. వారసత్వంగా వచ్చిన భూమి అయితే దానిని రెట్టింపు చేసి వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన దుచ్చెర్ల సత్యనారాయణ మాత్రం తనకున్న 70 ఎకరాల పొలాన్ని పక్షులు, జంతువులకు కేటాయించాడు. ఈ భూమిలో 60 ఏళ్లుగా కష్టపడి అడవిని సృష్టించారు. ఇందులో అరుదైన విత్తనాలను నాటి చెట్లను పెంచాడు. బ్యాంకులో వివిధ రకాల హోదాలో పనిచేసిన సత్యనారాయణకు పర్యావరణమంటే చాలా ఇష్టం. అయితే నేటి కాలంలో చాలామంది చెట్లను నరికి వేస్తున్నారు. దీంతో అడవుల్లో ఆశ్రయం పొందుతున్న జంతువులు, పక్షులు నిలువ నీడ లేక అల్లాడిపోతున్నాయి. దీంతో చిన్నపాటి అడవిని సృష్టించాలని సత్యనారాయణ భావించాడు.
Also Read: Forests : మన ఇండియాలోని ఈ అడవుల్లో దయ్యాలు ఉన్నాయి.. మీకు తెలుసా?
ఇందులో భాగంగా తనకున్న పొలంలోనే రకరకాల మొక్కలను నాటుతూ వచ్చాడు. ఇది 70 ఎకరాల్లో చిన్నపాటి అడవిగా మారింది. అయితే ఈ అడవిలో ఇతరులు ఎవరు రావడానికి వీలులేదు. ఈ అడవి కేవలం పక్షులు, జంతువుల కోసం మాత్రమే. ఇందులో పండిన పండ్లు, కాయలు కేవలం జంతువులు మాత్రమే తినాలని నిబంధనను పెట్టాడు. ఈ అడవిలో కాసిన కాయలు కుళ్లిపోయిన సరే అవి జంతువులకు మాత్రమే చెందాలని నిర్ణయించుకున్నాడు. అయితే జంతువులు, పక్షుల కోసం కేవలం చెట్లను మాత్రమే పెంచకుండా వాటికి నీరును అందించేందుకు కొన్ని గుట్టలను ఏర్పాటు చేశారు. వీటిపై నుంచి నీరు జాలువారే విధంగా తయారు చేశారు. ఇలా జాలువారిన నీరు అక్కడక్కడ నిలువ ఉంటుంది. ఈ నీరు జంతువులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
పర్యావరణం రక్షణ కోసం కేవలం ప్రకటనలు మాత్రమే ఇచ్చే వారున్న ఈ రోజుల్లో ప్రత్యేకంగా తన సొంత భూమిలో అడవిని సృష్టించిన దుచ్చెర్ల సత్యనారాయణ పై పలువురు పర్యావరణ వేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా జడ్చర్ల సత్యనారాయణ చేసిన సేవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెంట్ నో అందించింది. తనకు ఈ అవార్డు రావడం పై ఎంతో సంతోషించినా సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ కోసం మరింతగా కృషి చేస్తానని చెబుతున్నాడు.