MH370 Flight Mystery: ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏ వాహనం ఎక్కడ ఉందో జిపిఎస్ ద్వారా వెంటనే తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఎయిర్లైన్స్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు విమానయాన సిబ్బంది చెక్ చేసుకుంటూ ఉంటారు. అయితే విమానం గాలిలోకి ఎగిరే ముందు నుంచి నిర్నిత ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ల్యాండ్ అయ్యేవరకు విమాన జాడ తెలుస్తూనే ఉంటుంది. కానీ మలేషియా కు సంబంధించిన ఒక విమానం గాలిలోకి వెళ్లిన తర్వాత ఒకసారిగా మాయం అయిపోయింది. అయితే ఇప్పటివరకు ఆ విమానం మిస్టరీ అలాగే ఉండిపోయింది. 11 సంవత్సరాలుగా అది ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన గోయింగ్ 777-ZOOER MH 370 అనే విమానం 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరింది. ఇందులో మొత్తం 239 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయినా 45 నిమిషాల తర్వాత రాడార్ తో సంబంధం లేకుండా పోయింది. సాధారణంగా విమానాల ట్రాన్స్పాండర్లు ఆటోమేటిగ్గా డేటా గురించి తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఎంహెచ్ 370 లో ఈ ట్రాన్స్పాండర్ ఆగిపోయింది. మొదట అధికారులు ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీని గురించి సమాచారం ఆగిపోయింది. సైనిక రాడార్లు చూపిన డేటా ప్రకారం ఎమ్మెస్ 370 అసలు దిశను విడిచి పశ్చిమ వైపు వెళ్ళింది. ఆపై ఇండియన్ ఓషన్ వైపు గంటల తరబడి ప్రయాణించినట్లు తెలుస్తుంది.
ఈ విమానం గురించి పది దేశాలు 1,20,000 చదరపు కిలోమీటర్లు సముద్రాన్ని వెతికాయి. కానీ విమానం అవశేషాలు ఇప్పటికీ లభించలేదు. అయితే ఆఫ్రికాకు సమీపంలోని దీవుల్లో కొన్ని చిన్న ముక్కలు కనిపించాయి. ఇవే MH 370 విమానం నాకు సంబంధించినవి అని నిర్ధారించారు. అయితే విమానం లోని పైలట్ జహ్రి అహ్మద్ షా మార్చి 8వ తేదీన రాత్రి 1.20 సమయానికి గుడ్ నైట్ అని చెప్పిన ఒక నిమిషం లోపే విమానం రాడార్ కరెక్ట్ తెగిపోయింది. కానీ దీని గురించి పూర్తి వివరాలు తెలియలేదు. కొంతమంది అనుమానితులు విమానంలో ఉన్నారన్న వాదనలు వినిపించినప్పటికీ సరైన ఆధారాలను లభించలేదు. అంతేకాకుండా ఎవరు దీనిపై చర్చించలేదు. ఇక విమానంలోని ఎలక్ట్రికల్ సిస్టం పూర్తిగా ఫెయిల్ కావడంతో కమ్యూనికేషన్ కోల్పోయి పైలెట్లు ఆ దిశగా స్పందించలేదని మరోవాదనే ఉంది.
అయితే ఈ మిస్టరీ ఉండడానికి గల కారణం ఏంటంటే విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ఇప్పటివరకు లభించలేదు. విమానం చివరి లొకేషన్ చూపించే డేటా స్పష్టంగా లేదు. సముద్రం లోతు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల లోతుకు ఉండడం వల్ల పరిశోధన కష్టమైనట్లు అప్పటి అధికారులు తెలిపారు. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఈ విమానం కోసం ఎంతో శ్రమపడిన ఆచూకీ లభించకపోవడంపై MH 370 పై తీవ్రమైన చర్చ సాగుతుంది. అయితే అప్పటినుంచి సముద్రం వైపు విమానాలు వెళ్లే టాకింగ్ను మెరుగుపరిచారు. రియల్ టైం శాటిలైట్ ట్రాకింగ్ తప్పనిసరిగా చేశారు. బ్లాక్ బాక్స్ లు నీటిలో ఎక్కువ కాలం ఉండేలా అప్డేట్ చేశారు.