Homeవింతలు-విశేషాలుMalagasy Tribe Tradition: ఇదేం ఆచారం.. పూర్వీకుల ఎముకలకు కొత్త దుస్తులు.. ఆపై డ్యాన్స్..

Malagasy Tribe Tradition: ఇదేం ఆచారం.. పూర్వీకుల ఎముకలకు కొత్త దుస్తులు.. ఆపై డ్యాన్స్..

Malagasy Tribe Tradition: సాంకేతికంగా విపరీతంగా అభివృద్ధి చెందినప్పటికీ.. ఆకాశాన్ని తాకే భవంతులు నిర్మిస్తున్నప్పటికీ.. అనేక రకాలుగా మనుషులు మారిపోయినప్పటికీ.. కొంతమంది మాత్రం అలానే ఉంటున్నారు. పైగా తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. తమ నేపథ్యాన్ని ప్రపంచానికి గొప్పగా చాటుకుంటున్నారు. అటువంటి వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు.

పురాతన చరిత్రకు నిలయమైన మడగాస్కర్ ప్రాంతంలో మలగసి అనే తెగ ప్రజలను నివసిస్తూ ఉంటారు. వీరు వేట, వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు సామూహిక జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వేటకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.. అత్యంత పదునైన బాణాలు, విల్లంబులు ఉపయోగిస్తుంటారు. ఎంత పెద్ద జంతువునైనా సరే వేటాడుతూ ఉంటారు. వీరు తమ సంస్కృతి ఆధారంగా ఫామా దిహన అనే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఈ ఆచారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరు కూడా దీనిని పాటించరు. ఈ ఆచారం ప్రకారం మలగసి తెగవారు ఏడు సంవత్సరాలకు ఒకసారి తమ పూర్వీకుల సమాధులను తెరుచుతారు. వారి ఎముకలను బయటకు తీస్తారు. ఆ ఎముకలకు కొత్త వస్త్రాలను ధరింపజేస్తారు. సంగీత వాయిద్యాల మధ్య బంధువులందరూ నృత్యాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మృతుల కుటుంబాల ఆశీస్సులు తమకు ఉంటాయని వారు నమ్ముతుంటారు.

ఎముకలకు చనిపోయిన వారికి ఇష్టమైన దుస్తులను మాత్రమే ధరిస్తారు. వారికి నచ్చిన వంటకాలను తయారు చేస్తారు. సమాధుల మీద ప్రత్యేకమైన పాత్రలలో ఆ వంటకాలను పెట్టి.. ఆరగించి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఆ తర్వాత ఎముకలకు ప్రత్యేకమైన వస్త్రాలను ధరింపజేసి ఊరేగింపు చేస్తారు. అంతేకాదు పాటలు పాడుతూ.. పూర్వికుల ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేస్తారు. ఎముకలు బయటికి తీస్తున్నప్పుడు మలగసి తెగవారు కన్నీటి పర్యంతమవుతారు. దీనివల్ల తమ పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని.. వారి ఆశీస్సులు లభిస్తాయని మలగసి తెగవారు చెబుతుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version