World’s longest 57 km railway tunnel : అయితే ఇటువంటి ఎత్తైన బ్రిడ్జి మీద రైళ్లు నడవడం మనదేశంలో కొత్తకాక పోయినప్పటికీ .. చినాబ్ బ్రిడ్జి లాంటి ఎత్తైన వంతెనను ఇంతవరకు మనదేశంలో నిర్మించలేదు. మనదేశంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జిలు మాత్రమే కాకుండా.. అత్యంత పొడవైన సొరంగాలు కూడా ఉన్నాయి. వాటి మీదుగా రైళ్లు సుదీర్ఘంగా ప్రయాణిస్తున్నాయి. ఇటువంటి రూట్లు మనదేశంలో చాలా ఉన్నాయి. కానీ ప్రపంచంలో అతి పొడవైన రైల్వే టన్నెల్ ఒకటి ఉంది. అది శ్వేత దేశంలోనో, డ్రాగన్ దేశంలోనో కాదు.. భూలోక స్వర్గంగా పేర్కొందిన స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఈ దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఏడాదిలో ఎక్కువకాలం మంచు కురుస్తూనే ఉంటుంది. మంచు కురవని కాలంలో రైళ్లు నడపడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మంచు కురుస్తున్న సమయంలో రైళ్లు నడపడం అంతా తేలికైన వ్యవహారం కాదు. అందువల్లే కొండ ప్రాంతాలకు రైలు కల్పించడానికి ఏకంగా టన్నెల్స్ తవ్వారు. మనదేశంలో సుమారు వంద నుంచి 200 మీటర్ల పొడవుతో మాత్రమే టన్నెల్స్ ఉన్నాయి. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 57 కిలోమీటర్ల పొడవుతో టన్నెల్ స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. దీనిని గోథార్డ్ బేస్ టన్నెల్ అని పిలుస్తుంటారు.
Also Read : ఓరి దేవుడా! ఇది రైల్వే స్టేషన్ లేదా పర్యాటక ప్రదేశమా?
స్విట్జర్లాండ్ దేశంలోని ఆల్ఫ్స్ పర్వతాలను చీల్చి 20 సంవత్సరాల పాటు దీనిని నిర్మించారు. ఈ సొరంగం గుండా రైలు ఏకంగా 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. రైలులో ఉన్న ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తూ ఉంటుంది.. ఈ సొరంగం పొడవు ఏకంగా 57 కిలోమీటర్లు. దీనికోసం స్విజర్లాండ్ ప్రభుత్వం ఏకంగా వందల కోట్లు ఖర్చు చేసింది. సుమారు 20 సంవత్సరాల పాటు దీనిని నిర్మించింది. దీని నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. తరువులను తొలగించకుండా.. పర్వతాలలో జీవించే జంతువులకు హాని కలిగించకుండా దీనిని నిర్మించారు. పైగా కోర్టు కేసులు కూడా ఎదురయ్యాయి. వీటన్నిటిని తట్టుకొని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ సొరంగం నిర్మించింది. ఎప్పుడైతే ఈ సొరంగం అందుబాటులోకి వచ్చిందో.. అప్పటినుంచి రైలు కనెక్టివిటీ పెరిగింది. పైగా ప్రయాణికులకు ఇతర ప్రాంతాలను సందర్శించే అవకాశం కలిగింది. అందువల్లే స్విట్జర్లాండ్ పర్యాటక ఆదాయం కూడా పెరిగింది. ఇక ఈ రైలులో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో ప్రయాణించడాన్ని గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు.. వాస్తవానికి ఆల్ఫ్స్ పర్వతాలు దృఢమైనవి. అత్యంత దుర్భేద్యమైనవి. పర్వతాలను తొలచాలి అంటే.. వాటిలోపల సొరంగం తవ్వాలి అంటే అంత సులువైన విషయం కాదు. కానీ ఈ క్రతువును స్విట్జర్లాండ్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. వందల కోట్లు ఖర్చు పెట్టింది. సంవత్సరాలపాటు శ్రమకు ఓర్చింది. చివరికి రైలు మార్గాన్ని సుగమం చేసింది.