Pen that erases writing on paper : సాధారణంగా మనం పెన్నుతో ఒక పేపర్ మీద రాసినప్పుడు.. అనుకోకుండా తప్పులు దొర్లినప్పుడు.. వెంటనే కొట్టివేస్తాం. అది సాధ్యం కాకపోతే వైట్నర్ తో తుడిపి వేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని సందర్భాల్లో వైట్నర్ తో తుడిపి వేయడం సాధ్యం కాదు. పైగా పెద్ద పెద్ద దస్త్రాలలో వైట్నర్ ఉపయోగించడం వల్ల ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతుంటాయి. అందువల్లే కొంతమంది రాసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. కానీ మిగతావారు మాత్రం తప్పులు దొర్లి ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కార మార్గం సాధ్యం కాలేదు. మనదేశంలో ఇప్పటికీ తప్పులు దొర్లినప్పుడు వైట్నర్ ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ సమస్యకు చేయడం శాస్త్రవేత్తలు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. తద్వారా ప్రపంచం మొత్తం తమ వైపు చూసే విధంగా చేశారు.
చవకైన ఉత్పత్తులను తయారు చేయడంలో చైనా దేశస్తుల తర్వాతే ఎవరైనా. కాకపోతే అవి నాణ్యంగా ఉండకపోవడం వల్ల ఒక రకమైన అపవాదులు చైనా శాస్త్రవేత్తలు మోస్తున్నారు. అయినప్పటికీ చవకగా ఉత్పత్తులు అందించాలని ఉద్దేశంతో వారు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. యాదృచ్ఛికమో.. మరొకటి తెలియదు కానీ చైనా శాస్త్రవేత్తలు తయారు చేసిన ఏ ప్రయోగమైనా సరే ఉపయుక్తంగానే ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తర్వాత కాలంలో ఎదురైనప్పటికీ.. చైనా ఉత్పత్తులకు మాత్రం గిరాకీ ఏమాత్రం తగ్గదు…
వినూత్న ఆలోచనలతో.. విభిన్నమైన ఆవిష్కరణలు తయారు చేసే చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఉత్పత్తిని రూపొందించారు. దీంతో ప్రపంచం మొత్తం డ్రాగన్ దేశం వైపు ఆసక్తిగా చూస్తోంది. సాధారణంగా బాల్ పాయింట్ పెన్నుతో రాసే సమయంలో తప్పులు దొర్లినప్పుడు.. వాటిని సరి చేయడానికి వైట్నర్ ఉపయోగిస్తుంటాం. అయితే పెన్సిల్ తో రాతలు రాసేటప్పుడు ఎరేజర్ తో తుడిచి వేస్తుంటాం. అయితే పెన్నుతో రాసిన వాటిని అలా తుడిపి వేయడం సాధ్యం కాదు. అయితే చైనా దేశానికి చెందిన పరిశోధకులు రూపొందించిన ప్రత్యేకమైన పెన్ తో రాయడం సులభం. తప్పుడు దొర్లినప్పుడు తుడిచి వేయడం కూడా సులభమే. దీనివల్ల కాగితాన్ని ఏమాత్రం పాడు చేసే అవకాశం ఉండదు. పైగా రాసిన దాన్ని క్షణంలోనే ఎరేజ్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పేపర్ నష్టాన్ని పూర్తిగా తగ్గించవచ్చు. అయితే ఈ పెన్ను ప్రస్తుతం చైనా దేశం వరకు మాత్రమే పరిమితమైంది. వచ్చే రోజుల్లో ప్రపంచ దేశాలకు తెగుమతి చేస్తామని చైనా పరిశోధకులు చెబుతున్నారు. అదే కాదు ఈ పెన్నులో మరిన్ని పరిశోధనలు చేసి సరికొత్త ఆవిష్కరణ తీసుకొస్తామని పేర్కొంటున్నారు.
This ink eraser pen makes mistakes vanish like magic ✨️
— Tansu Yegen (@TansuYegen) June 2, 2025