Dream of flying in airplane : చదువుతుంటే హృదయ విదారకంగా అనిపించినప్పటికీ.. ఇప్పటికీ మనదేశంలో 95% మంది ఒక్కసారి కూడా విమానం ఎక్కడ లేదట. తాజాగా వెలువడిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ నివేదిక ప్రకారం మనదేశంలో చాలామందికి తలసరి ఆదాయం తక్కువగా ఉంది. తక్కువ ఆదాయం వల్ల జీవించడమే ఒక సమస్యగా మారిపోతుంది. నిత్యావసరాల నుంచి మొదలుపెడితే ఆస్పత్రిలో వైద్యం వరకు ప్రతిదీ కూడా అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అందువల్లే చాలామంది అన్ని ఆశలను చంపుకొని బతుకుతున్నారు. మన దేశంలో సుమారు 95 శాతం మంది ఇలానే తమ ఆకాంక్షలను, ఆశలను, కోరికలను అణుచుకుంటూ జీవిస్తున్నారు. ఇప్పటికీ 95% భారతీయులకు విమానం ఎక్కడో కలగానే మిగిలిపోయింది.. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో 70 నుంచి 8వ శాతం మంది తమ జీవితంలో విమానం ఎక్కలేదు. కనీసం విమానాన్ని దగ్గర్నుంచి కూడా చూడలేదు. ఏదో ఆకాశంలో ఎగురుతుంటే చూడటం తప్ప.. అలా వెళ్తున్న విమానాన్ని చూసి ఆనందించడం తప్ప..ఎవరూ విమానంలో ప్రయాణించలేదు. ప్రయాణించే అవకాశం కూడా లభించలేదు.
అయితే మన దేశంలో సంపద మొత్తం కేవలం ఐదు శాతం మంది మాత్రం వద్దనే పోగుపడిన నేపథ్యంలో.. వారు మాత్రమే విమానాలలో ప్రయాణిస్తున్నారు. అంతేకాదు సొంతంగా విమానాలను కొనుగోలు చేస్తున్నారు. ఆ ఐదు శాతం మందికి సొంతంగా విమానాలు ఉన్నాయి. అందులోనూ వాటిల్లో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇతర దేశాలకు వెళ్లడానికి.. ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ఆ ఐదు శాతం మంది తమ సొంత విమానాలను ఉపయోగిస్తుంటారు.. ముఖ్యంగా గత దశాబ్దంలో ఈ పరిణామం మరింత ఎక్కువైపోయింది. భారీగా సంపద ఉన్నవాళ్లంతా సొంతంగా విమానాలు కొనడం పరిపాటిగా మారిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది తమ జీవితంలో విమానం ఎక్కలేదని చదువుకున్నాం కదా.. అమెరికాలో మాత్రం పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. ఆ దేశ జనాభాలో సుమారు 88% మంది విమానయానాన్ని చేసేశారు. ఎందుకంటే శ్వేత దేశంలో విమానాశ్రయాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం చాలా దూరం ఉంటుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉండడంవల్ల చాలామంది విమానాలలో ప్రయాణిస్తుంటారు. అంతేకాదు తరచుగా రాకపోకలు సాగిస్తుంటారు. పైగా శ్వేత దేశంలో విమానయాన సంస్థలు అధికంగా ఉంటాయి. పైగా అక్కడ విమానాశ్రయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలు ఒక ప్రాంతాన్ని నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి విమానయానాన్ని మాత్రమే ఇష్టపడుతుంటారు. మనదేశంలో విమానాశ్రయాలు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ 95 శాతం మంది తమ జీవితంలో ఒక్కసారి కూడా విమానం ఎక్కలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.