Layoffs: ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు.. ప్రతి పురుషుడు ఏదో ఒక పని చేయక తప్పదు. డబ్బులు సంపాదించడం కోసం ఉద్యోగం చేయడం కోసం చిన్నప్పటి నుంచే కష్టపడుతూ ఉంటారు. మంచి చదువు ఉంటే మంచి ఉద్యోగం వస్తుందని చాలామంది నిత్యం శ్రమిస్తూ ఉంటారు. అయితే ఎంత డబ్బు సంపాదించినా.. ఎన్ని విజయాలు సాధించినా.. కుటుంబంతో గడిపే ఒక్క క్షణంతో అవన్నీ తొలగిపోతాయని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పనిచేస్తూ ఉండేవారు కుటుంబంతో ఎక్కువగా గడపలేక పోతున్నారు. దీంతో పిల్లలు, తండ్రుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ఉద్యోగి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఉద్యోగి చేసిన ట్వీట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఒకసారి ఉద్యోగం వస్తే అందులో అనుభవం పొందిన తర్వాత.. అదనపు ఆదాయం కోసం ఇతర కంపెనీలకు మారేవారు కొందరు ఉంటారు. ఒకే కంపెనీలో ఎక్కువ కాలం చేసేవారు మరికొందరు ఉంటారు. అయితే కొందరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం చేయడానికి ఇష్టపడతారు. తమ అభివృద్ధితోపాటు కంపెనీ అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తూ ఉంటారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్ల పాటు ఒక కంపెనీ కోసం పనిచేసిన ఓ కంపెనీ ఇటీవల లేఆఫ్ ప్రకటించింది. దీంతో ప్రస్తుతానికి తన ఉద్యోగం లేకపోవడంతో కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే ఉద్యోగం చేసినన్ని రోజులు ఏమాత్రం మనశ్శాంతి లేదని.. ఇప్పుడు తన బిడ్డను స్కూలు నుంచి తీసుకువచ్చే సమయంలో తన చిరునవ్వు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అతడు పేర్కొన్నాడు. 17 ఏళ్లు తాను చేసిన శ్రమ ఒక్కసారిగా మర్చిపోయానని పేర్కొన్నాడు.
ఉద్యోగంలో ఉన్నంతసేపు నిత్యం కంపెనీ గురించే ఆలోచించిన అతను కుటుంబం గురించి ఏమాత్రం ఆలోచించలేదని చెప్పాడు. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువసేపు ఉండలేకపోయాను అని బాధపడ్డాడు. అలా బాధపడిన తనకు ఇప్పుడు కంపెనీ లే ఆఫ్ తో వారితో కాలక్షేపం చేయడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. ఉద్యోగులు ఎవరైనా తమ విధులతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం కేటాయించే ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొంటున్నాడు. ఇలా కుటుంబంతో సమయం కేటాయించకపోతే జీవితంలో అత్యంత విలువైన అనుభవాలు కోల్పోతారని పేర్కొంటున్నాడు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే ఇటీవల కాలంలో చాలా కంపెనీలు లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ కంపెనీ లే ఆఫ్ ప్రకటించడంతో ఒక వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోయి ఇలా ట్రీట్ చేశాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు? కంపెనీ ఏంటిది? అనేది మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనా అతను చేసినా ట్వీట్ అందరినీ ఆలోచింపజేసేలా చేసింది. ప్రతి ఉద్యోగ జీవితంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కొందరు చర్చించుకుంటున్నారు.