Bigg Boss Tamil Fight : బిగ్ బాస్ అనేది మన దేశానికి చెందినది కాదు. వెస్ట్రన్ కంట్రీస్ లో మైండ్ గేమ్ తరహాలో ఈ రియాల్టీ షో నిర్వహించేవారు. శిల్ప శెట్టి ద్వారా ఈ షో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ షోను మన దేశానికి తీసుకొచ్చారు. మనదేశంలో ఎండమాల్ అనే కంపెనీ బిగ్ బాస్ షో నిర్వహిస్తోంది. ప్రస్తుతం అనేక ప్రాంతీయ చానల్స్ లో బిగ్ బాస్ షో స్టార్ గ్రూప్ టెలికాస్ట్ చేస్తోంది.
తెలుగులో మాదిరిగానే ప్రస్తుతం తమిళనాడులో బిగ్ బాస్ షో నడుస్తోంది. బిగ్బాస్ షో అనేది మైండ్ గేమ్ కు సంబంధించింది. ఒక మనిషి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల మధ్య కొద్దిరోజుల పాటు ఎలా ఉంటాడు.. తన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటాడు.. ఇలా అనేక అంశాల ఆధారంగా ఆ షో నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాలలో నిర్వాహకులు టాస్కులు ఇస్తుంటారు. వీటిని పూర్తి చిత్రంలో కంటెస్టెంట్లు అదుపుతప్పుతుంటారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి సంఘటనే తమిళ బిగ్ బాస్ లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
తమిళ బిగ్ బాస్ స్టార్ విజయ్ లో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో భాగంగా నిర్వాహకులు ఒక టాస్క్ ఇచ్చారు. దానిని పూర్తిచేసే క్రమంలో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. హద్దు దాటి ప్రవర్తించారు. కంటెస్టెంట్లు కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ వాగ్వాదానికి దిగారు. కమరుద్దీన్ ఆగ్రహంతో ప్రవీణ్ రాజ్ పై దూసుకుపోయాడు. దీంతో ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. అది ప్రోమోలో కనిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్లు మధ్యలో ప్రవేశించి గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే ఇది చూసిన వారంతా కూడా ఇది బిగ్ బాస్ లాగా లేదని.. వీధి పోరాటం లాగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో బిగ్ బాస్ కు రేటింగ్స్ తగ్గిపోయిన నేపథ్యంలో.. ఇలా కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టిస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గొడవలు పెట్టించి టిఆర్పి రేటింగ్స్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Prank Fight
Well Executed #BiggBossSeason9Tamil #BiggBossTamilSeason9 #biggbosstamil9 #BiggBoss9Tamil #BiggBossTamil pic.twitter.com/XlBltCOSuC
— BIGG BOSS TAMIL (@Biggbossnk) November 4, 2025