Homeఉద్యోగాలుPostal Department Recruitment 2026: పోస్టల్‌ శాఖలో కొలువులు.. రాత ఫరీక్ష లేకుండానే ఎంపిక.. త్వరపడండి

Postal Department Recruitment 2026: పోస్టల్‌ శాఖలో కొలువులు.. రాత ఫరీక్ష లేకుండానే ఎంపిక.. త్వరపడండి

Postal Department Recruitment 2026: కేంద్రం ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తోంది. 2025లో రైల్వే, బ్యాంకింగ్, పోస్టల్‌ శాఖల్లో వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. 2026 ప్రారంభంలో కూడా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా పోస్టల్‌ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. 28,740 ఉద్యోగాలు.. భారత పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా 28,740 పదవులను ప్రకటించింది. గ్రామీణ డాక్‌ సేవకులు, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లు, అసిస్తెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. […]

Postal Department Recruitment 2026: కేంద్రం ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తోంది. 2025లో రైల్వే, బ్యాంకింగ్, పోస్టల్‌ శాఖల్లో వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. 2026 ప్రారంభంలో కూడా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను కొనసాగిస్తోంది. తాజాగా పోస్టల్‌ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది.

28,740 ఉద్యోగాలు..
భారత పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ దేశవ్యాప్తంగా 28,740 పదవులను ప్రకటించింది. గ్రామీణ డాక్‌ సేవకులు, బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్లు, అసిస్తెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆరంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో 1,060, తెలంగాణలో 609 ఖాళీలు ఉన్నాయి. ఫిబ్రవరి 14 వరకు ఆన్‌లైన్‌ అప్లై చేసుకోవాలి.

అర్హతలు ఇవీ..
పోస్టల్‌ ఉద్యోగాలకు పదో తరగతి మాత్రమే అర్హత. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్‌ జాబితా ఆధారంగా ఎంపిక జరుగుతుంది, ఇంటర్వ్యూ కూడా ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇది సువర్ణ అవకాశం.

దరఖాస్తు విధానం..
అధికారిక వెబ్‌సైట్‌ https://indiapostgdsonline.gov.in లోకి వెళ్లాలి. తర్వాత ’న్యూ రిజిస్ట్రేషన్‌’ క్లిక్‌ చేసి, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ద్వారా సైనప్‌ కావాలి. అర్హతలు చూసుకుని, ఫారం ఫిల్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. మెరిట్‌ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. తర్వాత https://indiapost.gov.in/gdsonlineengagement లో చెక్‌ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి, స్థిరమైన ఆదాయం, ప్రభుత్వ సౌకర్యాలు అందిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో వందలాది పోస్టులు ఉండటంతో స్థానిక యువతకు ప్రాధాన్యత. చివరి తేదీ సమీపిస్తోంది. వెంటనే అప్లై చేయండి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper