Largest Truck In India : ఇండియాలోనే ఓ అతిపెద్ద ట్రక్కు దేశంలోని రోడ్లపై ఏడాదిగా ప్రయాణిస్తూనే ఉంది.. సాధారణంగా నిత్యం రోడ్ల మీద తిరిగే ట్రక్కులకు 10 లేదా 20 చక్రాలు ఉంటాయి. కానీ ఈ భారీ ట్రక్కుకు ఏకంగా 400 చక్రాలు ఉన్నాయి. దీనిని చూస్తే ఓ పెద్ద రైలు బండిలా కనిపిస్తుంది. సాధారణంగా పెద్ద యంత్రాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం చాలా కష్టమైన పని. ఇటువంటి పనికి చాలా పెద్ద బలమైన ట్రక్కులు అవసరం అవుతాయి. ఈ మధ్య కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరుచూ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన మిషన్లను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంటాయి. రోడ్లపై ఇవి ప్రయాణిస్తుంటే అందరి కన్ను వాటిపైనే ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్న వాటిని విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకేళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహయంతో గమ్యస్థానాలకు చేరవేస్తుంటారు. భారీ సైజులో ఉన్న బాయిలర్లను అత్యంత భారీ ట్రక్కులు మోసుకెళ్తున్న ఘటన హర్యానా రోడ్లపై కనిపించింది. ఇలాంటి భారీ ట్రక్కులు రోడ్ల పై వెళ్తుండగా అక్కడి వారు తమ వాహనాలను నిలుపుకుని ఆసక్తి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ ట్రక్కులకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
400చక్రాలు
భారీ ట్రక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద యంత్రాన్ని తరలించేందుకు భారతదేశంలోనే అత్యంత పొడవైన ట్రక్కు తయారైంది. ఈ ట్రక్కుకు 400 చక్రాలు ఉన్నాయి. సాధారణంగా నిత్యం రోడ్ల మీద తిరిగే ట్రక్కులకు 10 లేదా 20 చక్రాలు ఉంటాయి. కానీ ఈ భారీ ట్రక్కుకు ఏకంగా 400 చక్రాలు ఉన్నాయి. దీనిని చూస్తే ఓ పెద్ద రైలు బండిలా కనిపిస్తుంది. ఈ ట్రక్కు గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు నుంచి 1,150కిలో మీటర్ల దూరంలో ఉన్న హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌కు పెద్ద డ్రమ్‌ను తీసుకువెళుతోంది. ఈ డ్రమ్‌ను పెట్రోల్ రిఫైనరీలలో ఉపయోగించే కోక్ బాయిలర్.
ఒక్కో దాని బరువు 8లక్షల కిలోలు
ఇంత పెద్ద బరువును మోయడానికి మూడు వోల్వో ట్రక్కులు ఈ 400 చక్రాల ట్రైలర్‌ను లాగుతున్నాయి. ఈ ట్రక్ ఎంత పెద్దది, దాని బరువు ఎంత? అనే దాని గురించి “A to Z Haryana” అనే యూట్యూబ్ ఛానెల్లో ఈ ట్రక్ గురించిన వీడియో అప్లోడ్ చేయబడింది. ఆ వీడియోలో ఈ ట్రక్ ఎలా పనిచేస్తుందో.. ఈ ప్రయాణం ఎంత కష్టతరమైనదో చూపించారు. ఈ బాయిలర్ల బరువు ఒక్కొక్కటి దాదాపు 8 లక్షల కిలోలు ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అందుకే వీటిని విమానాల ద్వారా తీసుకెళ్లలేరు. షిప్‌ల ద్వారా కూడా రవాణా చేయడం కూడా చాలా కష్టం. అందుకే రోడ్డు మార్గం నుంచే వీటిని హర్యానాకు తరలిస్తున్నారు.
3500హార్స్ పవర్
ఇలాంటి భారీ వాహనాల వల్ల మన దేశంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయి. అయితే ఇలాంటి భారీ వాహనాలు వెళ్లాలంటే గట్టి రోడ్లు చాలా అవసరం. భారతదేశంలో అత్యంత పొడవైన ట్రక్కును నడపడానికి దాదాపు 27 మంది సిబ్బంది అవసరం అవుతున్నారు. ఈ భారీ వాహనం తన గమ్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే ఏడాదికి పైగా ప్రయాణిస్తూనే ఉంది. దాని గమ్యాన్ని చేరుకోవాలంటే మరో 2-3 నెలలు పట్టవచ్చు. ఈ ట్రక్ రోడ్డు బాగుండి అన్నీ అనుకూలంగా ఉంటే రోజుకు దాదాపు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయితే అనుమతుల కోసం ఎక్కువ రోజులు ఒకేచోట ఉండాల్సి వస్తోంది. ఇంత పెద్ద బరువును 3,500 హార్స్‌పవర్‌తో ప్రయాణిస్తున్నాయి. ఈ ట్రక్కుల్లో పలు కారణాల వల్ల ఇప్పటి వరకు 200 టైర్లను మార్చారు. వీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 250 ఉద్యోగులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
తాత్కాలిక వంతెనల నిర్మాణం
ఇంత పెద్ద యంత్రాన్ని తరలించడం చాలా కష్టం. రోడ్లను మూసేయాలంటే ప్రత్యేక అనుమతులు అవసరం కాబట్టి ప్రయాణం చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు దారి పొడవునా తాత్కాలిక నిర్మాణాలను కూడా చేపట్టాల్సి వస్తోంది. ఇలాంటి అనుకోని సమస్యలు ప్రయాణాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. ఇంత పెద్ద మెషీన్లను దగ్గరగా చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ యంత్రాలను ఆపరేట్ చేసే వ్యక్తులతో మాట్లాడినప్పుడు.. భారతదేశంలో ఇంత భారీ లోడ్లను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Largest truck in india 400 wheels journey since a year the story of the largest truck in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com