Justin Trudeau: కెడనా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వార్థంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఏడాది క్రితం కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హత్య ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ నాడే ఖండించింది. సాక్షాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా.. తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి.. భారత రాయబారులను విచారణ చేసేందుకు సిద్ధమైంది. వెంటనే అప్రమత్తమైన భారత్.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. భారత్‌లోని కెనడా రాయబారులను ఇక్కడి నుంచి బహిష్కరించింది. దీంతో దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడా.. భారత్ విషయాలను అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రికకు అందించి కథనాలు రాయించింది. అంతటితో ఆగకుండా నిజ్జర్ హత్య గురించి భారత హోం మంత్రి అమిత్‌షాకు ముందే తెలుసని ఆరోపించింది.
తాజాగా మోదీని టార్గెట్ చేసి..
పాకిస్తాన్ తరహాలో భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్న కెనడా ప్రధాని ట్రూడో తాజాగా మరోమారు కెనడా పత్రిలో భారత ప్రధాని మోదీపై ఓ కథనం రాయించారు. అందులో నిజ్జర్ హత్య గురించి భారత ప్రధాని మోదీకి ముందే తెలుసని రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలవడానికి భారతీయులను తమవైపు తిప్పుకోవడానికి కెనడా ప్రధాని చేస్తున్న చీఫ్ ట్రిక్స్‌లో ఇది ఒకటి అయింది.
తప్పుడు కథనాలు మానుకోవాలి..
ఇక కెనడా కథనంపై భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. తాము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందిరమని, కొన్ని అసత్య ప్రకటనల నేపథ్యంలో స్పందించాల్సి వస్తోందన్నారు. నిరాధారమైన ఇలాంటి కథనాలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలకు అధికారుల జవాబు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి కథనాలతో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని తెలిపారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Another move by justin trudeau this time the target is modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com