https://oktelugu.com/

Largest Snake: అతిపెద్ద పాము గుర్తింపు.. సాక్షాత్తు పరమేశ్వరుడిదేనా?

వాస్తవానికి ఈ శిలాజాన్ని 2005లోనే ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అనేక పరిశోధనల తర్వాత ఇటీవలే దానిని అతిపెద్ద పాము శిలాజాలంగా నిర్ధారించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 19, 2024 / 06:03 PM IST

    Largest Snake

    Follow us on

    Largest Snake: ప్రపంచ వ్యాప్తంగా వేల రకాల పాములుఉన్నాయి. ఇందులో కొన్ని విషపూరితమైతే మరికొన్ని విషపూరితం కానివి. ఇక మన దేశంలో కూడా చాలా రకాల పాము జాతులు ఉన్నాయి. అయితే నాగు పామును భారతీయులు పవిత్రంగా భావిస్తారు. నాగు పాముల్లో కూడా రకాలు ఉన్నాయి. అతిపెద్ద జాతులు ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు భారత దేశంలోనే అతిపెద్ద పాము ఉనికిని గుర్తించారు. దానికి సంబంధించిన శిలాజాన్ని గుజరాత్‌లో కనుగొన్నారు. ఆ శిలాజంలోని పాము వెన్నుపూస డైనోసర్‌ టీ రెక్స్‌(వెన్నుపూస) కన్నా పొడవుగా ఉండే పాము అవశేషాలని తెలిపారు.

    2005లోనే గుర్తింపు..
    వాస్తవానికి ఈ శిలాజాన్ని 2005లోనే ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అనేక పరిశోధనల తర్వాత ఇటీవలే దానిని అతిపెద్ద పాము శిలాజాలంగా నిర్ధారించారు. దీనికి వాసుకి ఇండికస్‌ అని పేరు పెట్టారు. పరివోధలో ఈ పాములో దాదాపు 27 వెన్నుపూసలు ఉన్నట్లు గుర్తించారు.

    విషపూరితం కాదు..
    ఇది అతిపెద్ద కొండ చిలువలా ఉంటుందని అంచనా వేశారు. విషపూరితం కూడా కాదని పేర్కొన్నారు. ఈ పాము పొడవు 50 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. ఇక దీని బరువు ఒక టన్ను వరకు ఉంటుందని పేర్కొన్నారు. వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రెడేటర్‌గా ప్రకటించారు. ఇది చిత్తడి నేలల్లో నివసించేదని ఐఐటీ రూర్కిలోని పాలియోంటాలిజీ పరిశోధకుడు దేబిజిత్‌ దత్తా తెలిపారు.

    శివుడితో సంబంధం..
    ఇక శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ పాము జాతుల మూలాలను అవ్వేశించారు. ఈ క్రమంలో ఈ పాము శిలాజానికి సాక్షాత్తు పరమ శివుడితో సంబంధం ఉందని గుర్తించారు. అందుకే దీనికి వాసుకి అని పేరు పెట్టినట్లు శాస్త్రవేత్త దేబిజిత్‌ దత్తా తెలిపారు.

    అత్యంత పెద్దపాము..
    ఈ భూమిమీద ఇప్పటి వరకు అత్యంంత పెద్ద పాముగా కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి గుర్తింపు ఉంది. దానికి సరిసమాన పాముగా వాసుకిని గుర్తించారు. టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకుపైగా బరువుతో ఉంది. వాసుకిమ పాము శరీర పొడవుని టైటానోబోవాతో పోల్చగా, టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. ఇక్కడ టైటానోబోవా కంటే వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేది చెప్పలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఆసియాలోని రెటిక్యులేటెడ్‌ అనే కొండ చిలువ(33 అడుగులు పొడవు) గుర్తింపు పొందింది.