Lok Sabha Elections: దేశంలో 2024 పార్లమెంట్ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం(ఏప్రిల్ 19న) ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో తొలి దశలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
పోలింగ్ సరిగే స్థానాలు ఇవీ..
తమిళనాడు (39), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. , అండమాన్ మరియు నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1) మరియు లక్షద్వీప్ (1). అసోం, మహారాష్ట్రలో ఐదు, బీహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ (50 సీట్లు), సిక్కిం (32) అసెంబ్లీలకు మొదటి విడతలోనే ఎన్నికలు జరిగాయి.
5 గంటల వరకు పోలింగ్ ఇలా..
ఇక సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయినా క్యూలైన్లలో ఇంకా ఓటర్లు ఉండడంతో క్యూలో ఉన్నవారందరికీ ఓటే వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 60 శాతం, రాజస్థాన్‌లో 47.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 55 శాతం, మధ్యప్రదేశ్‌లో 58 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలతోపాటు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల విషయానికొస్తే, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలో వరుసగా 60.7 మరియు 61,4 శాతం పోలింగ్ నమోదైంది. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. వీరు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తున్నారు.
చెదురుముదురు ఘటనలు..
బెంగాల్‌లో, కూచ్ బెహార్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఓటర్లను భయపెట్టడం, పోల్ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారని తెలిసింది. మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లోని పోలింగ్ స్టేషన్‌లో కాల్పులు జరిగాయి. ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఓ పోలింగ్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. తమిళనాడులో, సేలం జిల్లాలో పోలింగ్ బూత్‌ల వద్ద ఇద్దరు వృద్ధులు మరణించారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతాలు
– అండమాన్ నికోబార్ -45.48శాతం
– అరుణాచల్ ప్రదేశ్ -55.05 శాతం
– అస్సాం -60.70 శాతం
– చత్తీస్ ఘడ్ -58.14శాతం
– జమ్మూ-కాశ్మీర్ -57.07 శాతం
– లక్షద్వీప్ -43.98 శాతం
– మధ్యప్రదేశ్ -53.40 శాతం
– మహారాష్ట్ర -44.12శాతం
– మణిపూర్ -63.03 శాతం
– మేఘాలయ -61.95 శాతం
– మిజోరాం -49.77 శాతం
– నాగాలాండ్ -51.73 శాతం
– పుదుచ్చేరి -58.86 శాతం
– రాజస్థాన్ -41.51 శాతం
– తమిళనాడు -51.10 శాతం
– త్రిపుర -68.35శాతం
– ఉత్తరప్రదేశ్ -47.44 శాతం
– ఉత్తరాఖండ్ -45.62 శాతం
– పశ్చిమబెంగాల్ -66.34 శాతం