spot_img
Homeవింతలు-విశేషాలుIran Israel War Impact: సామాన్యుడి బెడ్‌రూంకు యుద్ధ సెగ.. డైరెక్ట్‌గా పని కానిచ్చేస్తున్నారు..

Iran Israel War Impact: సామాన్యుడి బెడ్‌రూంకు యుద్ధ సెగ.. డైరెక్ట్‌గా పని కానిచ్చేస్తున్నారు..

Iran Israel War Impact:  పశ్చిమాసియా యుద్దం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. వైమానిక దాడులకుతోడు పదాతి దళాలను అమెరికా రంగంలోకి దించుతోంది. దీంతో యుద్ధం మరింత తీవ్ర కాబోతోంది. యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలపై ప్రభావం పడుతోంది. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. యుద్ధ జ్వాలలు కేవలం పెట్రోల్‌ ధరలకే కాదు, సామాన్యుడి అత్యంత వ్యక్తిగత అవసరాలకూ తాకుతున్నాయి. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణల కారణంగా భారతదేశంలో కండోమ్‌ తయారీ సంక్షోభంలో పడింది. ముడి పదార్థాల కొరత, రవాణా ఆటంకాలతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడంతో, ధరలు 10 నుంచి 20 శాతం పెరిగే ప్రమాదం ఉంది.

సంక్షోభానికి మూల కారణం ఇదే..
కండోమ్‌ తయారీలో కీలకమైన సింథటిక్‌ రబ్బరు (లాటెక్స్‌ కాదు), పాలిమర్లు, లూబ్రికెంట్లు అన్నీ పెట్రోలియం ఉప ఉత్పత్తులే. యుద్ధం కారణంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో, ఈ ముడి పదార్థాల తయారీ ఖర్చు 30 నుంచి 40 శాతం పెరిగింది. భారత్‌ సింథటిక్‌ రబ్బరు అవసరాలలో 48% దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ జలసంధి గుండా రసాయనాలు, గ్యాస్‌ రవాణా ఆలస్యం అవుతోంది. నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో (ఆఫ్రికా చుట్టూ) ప్రయాణించాల్సి రావడంతో ఛార్జీలు రెట్టింపయ్యాయి. సరఫరా సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది, దీంతో ఫ్యాక్టరీల్లో ముడి పదార్థాల నిల్వలు అడుగంటాయి.

పరిశ్రమపై ప్రభావం..
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్‌ ఉత్పత్తిదారులలో ఒకటి. కానీ ఈ సంక్షోభం దేశీయ దిగ్గజాలను కుదిపేస్తోంది. సింథటిక్‌ రబ్బరు, లూబ్రికెంట్ల ధరలు పెరగడం తయారీ పెరిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఒక్కో కంటైనర్‌ ఖర్చు రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో సంస్థలు ధరలను 10 నుంచి 20 శాతం పెంచాలని భావిస్తున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో ఆఫ్రికా, ఐరోపాకు ఎగుమతులు మందగించాయి. భారత్‌ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్‌ ఎగుమతులు మందగించడం వల్ల దేశానికి వచ్చే విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం పడనుంది. ఇది రూపాయి విలువపై ఒత్తిడిని పెంచవచ్చు

వీటిపై ప్రభావం..
కేరళ, తమిళనాడు వంటి రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్‌ మార్కెట్లో కండోమ్‌ ధరలు పెరగడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది అదనపు భారంగా మారనుంది. భారత ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం వెచ్చించే బడ్జెట్‌ భారీగా పెరగనుంది. జనాభా నియంత్రణ కార్యక్రమాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కండోమ్‌లతోపాటు గౌజులు, క్యాథెటర్లు, ఇతర రబ్బరు వైద్య పరికరాల ధరలు కూడా పెరగనున్నాయి.

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు. అది సామాన్యుడి గది వరకు చేరి, అత్యంత వ్యక్తిగత అవసరాలను కూడా ప్రభావితం చేస్తోంది. కండోమ్‌ ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది ప్రజారోగ్యం, జనన నియంత్రణ కార్యక్రమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది .

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version