https://oktelugu.com/

Bigg Boss Telugu 8: రోహిణి పై పగ పెంచేసుకున్న విష్ణు ప్రియ..టాస్క్ లో టార్గెట్ చేసి కొట్టింది..ఏడ్చేసిన రోహిణి!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు విష్ణు ప్రియా. ఈమెకు ప్రారంభంలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా ఈమె ఓటింగ్ లో అందరి కంటే ముందు ఉండేది. కానీ ఈమె హౌస్ లో ఆడిన ఆట తీరుకు ప్రతీ వారం గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు డేంజర్ జోన్ కి చాలా దగ్గరకు వచ్చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 12, 2024 / 06:42 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు విష్ణు ప్రియా. ఈమెకు ప్రారంభంలో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా ఈమె ఓటింగ్ లో అందరి కంటే ముందు ఉండేది. కానీ ఈమె హౌస్ లో ఆడిన ఆట తీరుకు ప్రతీ వారం గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు డేంజర్ జోన్ కి చాలా దగ్గరకు వచ్చేసింది. హౌస్ లో ఈమె ఇన్ని రోజులు ఏమి చేసింది అని అడిగితే, కేవలం పృథ్వీ చుట్టూ ప్రదిక్షణలు చేసింది అని మాత్రమే చెప్పగలము. ఆడాలనే కసి ఉండదు, టైటిల్ కొట్టాలనే కోరిక ఉండదు, ఏందో ఈ అమ్మాయి అని ఆమెని అభిమానించే వారికి కూడా అనిపించింది. ముఖ్యంగా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన రోహిణి, విష్ణు ప్రియ కి మంచి స్నేహితురాలు. హౌస్ లోకి రాకముందు మొదటి రెండు వారాలు ఇంస్టాగ్రామ్ లో విష్ణు ప్రియ కి ఓట్లు వేయండి అంటూ స్టోరీలు కూడా పెట్టింది రోహిణి.

    అలాంటి రోహిణి కి తన స్నేహితురాలి ఆట రోజు రోజుకి తగ్గిపోతూ వెళ్తుంది, ఆమె గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారో కుండబద్దలు కొట్టినట్టు చెప్పి, ఆట తీరుని మార్చుకోమని చెప్తే, విష్ణు ప్రియ దానికి పగబట్టేసింది. నిన్న రోహిణి బెడ్ రూమ్ లో ఉండగా అక్కడికి వెళ్తుంది విష్ణు ప్రియ. రోహిణి తో మాట్లాడుతూ పృథ్వీ తో నన్ను లింక్ చేసి మాట్లాడడం నాకేమి నచ్చలేదు, నేను ఎప్పుడైనా ఎమోషనల్ గా బాగా తగ్గినప్పుడు అతని దగ్గరకు వెళ్తున్నానే తప్ప, మిగిలిన సందర్భాలలో వెళ్లడం లేదు అని అంటుంది. అప్పుడు రోహిణి ‘నేను నీ ఆట బాగు కోసం చెప్పాను, నీ గురించి, పృథ్వీ గురించి కొత్త కల్పించి నేనేమి చెప్పలేదు, అది నీకు బాధ కలిగించి ఉండుంటే నన్ను క్షమించు’ అని అంటుంది. ఇక్కడితో ఈ విషయాన్నీ వదిలేయకుండా, విష్ణు ప్రియ దానిని ముందుకు తీసుకెళ్లింది.

    మెగా చీఫ్ పోటీలలో భాగంగా బిగ్ బాస్ పెట్టిన బాల్స్ టాస్క్ లో విష్ణు ప్రియ మొదటి రౌండ్ లో కేవలం రోహిణి ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీనికి రోహిణి పాపం బాగా బాధపడుతుంది. ఆ మరుసటి రౌండ్ లో కూడా ఆమె ఎక్కువగా రోహిణినే టార్గెట్ చేసి ఆమెను ఓడిపోయేలా చేస్తుంది. ఆమె మంచి కోసం బయట ఏమి జరుగుతుందో నేను చెప్తే, దానిని ఆమె వేరేలా అర్థం చేసుకొని నన్ను టార్గెట్ చేసి కావాలని ఓడించింది, బయట ఆమె నాకు చాలా మంచి స్నేహితురాలు, ఆమె కోసం నేను బయట సపోర్టు కూడా చేశాను, కానీ ఇలా చేస్తుందని మాత్రం అనుకోలేదు అంటూ వాష్ రూమ్ లో కూర్చొని ఏడ్చేస్తుంది రోహిణి..ఎప్పుడూ సరదాగా ఉండే రోహిణి ని ఇలా ఎమోషనల్ గా ఏడుస్తూ ఉండడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

    Tags