Dead Sea: సాధారణంగా ఈత వచ్చిన వారే నీటిలో దిగుతారు.మీటర్ల కొద్ది ఈత కొట్టగలరు. అటువంటి వారే నీటిపై తేలియాడగలరు. అందులో సముద్రంలో అయితే ఈత వచ్చినా దిగేందుకు చాలామంది భయపడతారు. అయితే ఆ సముద్రంలో ఈత రాకపోయినా నీటిపై తేలుతారట. చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు ఈత కొడుతుంటారు. మునిగే ప్రయత్నం చేసినా తేలియాడుతుంటారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అది సముద్రమని తెలియడం మరింత ఆసక్తికరం. అది ఏ సముద్రమో ఒకసారి తెలుసుకుందాం.
ఆ సముద్రం పేరు డెడ్ సి. ఇది ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ప్రాంతంలో ఉంటుంది. సముద్రం అనగానే పెద్ద పెద్ద అలలు, రకరకాల చేపలు, తాబేళ్లు,ఇంకా ఎన్నో జీవులు గుర్తొస్తాయి. కానీ ఈ డెడ్ సి లో అటువంటివి కనిపించవు. ఈ సముద్రపు నీటిలో నడవొచ్చు, కూర్చోవచ్చు, స్వేచ్ఛగా పేపర్ చదవచ్చు. సముద్రం మధ్యలోకి వెళ్లిన నీటిలో మునగరు. ప్రపంచంలోనే ఈ సముద్రం ఎంతో ప్రత్యేకమైనది.
అయితే ఈ సముద్రపు నీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. సాధారణ సముద్రపు నీటి కంటే పది రెట్లు ఉప్పు శాతం ఎక్కువ. అందుకే దీంట్లో ఎటువంటి జీవరాశులు జీవించలేవు.ఇది సముద్రమట్టానికి 1142 అడుగుల దిగువున ఉంటుంది. 306 మీటర్లు లోతులో ఉంటుంది. సముద్రంలోని నీటి ప్రవాహం దిగువ నుంచి పైకి ఉంటుంది. దీని నీటి సాంద్రత కారణంగానే.. మనుషులు తేలియాడగలుగుతున్నారు.
ఈ డెడ్ సీలో బ్రోమైడ్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియంతో పాటు సల్ఫర్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి.దీని కారణంగా నీటి అంచున రాళ్లు, ఇసుక మెరుస్తుంటాయి. నీరు ఎక్కువగా ఉప్పుగా మారడానికి ఇదే కారణమని నిపుణులు చెబుతుంటారు. ఇందులో స్నానం చేయాలంటే ముందుగా అక్కడ ఉన్న సిమడ్ మాస్క్ తో కప్పుకోవాలి.దీంతో వారి శరీరం ఆ బంక మట్టిలో ఉన్న హైలురోనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలను గ్రహిస్తుంది. అయితే ఈ డెడ్ సి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై ఆ ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.