Mahesh-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి.. ఈయన ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమాని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక అందుకోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా తన వెంట పెట్టుకొని సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు లుక్కుకు సంబంధించి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు ఫోటోలను చూసినట్లయితే పొడుగాటి జుట్టుతో అద్భుతమైన లుక్కుతో మహేష్ బాబు కనిపించడం నిజంగా అతని అభిమానులతో పాటు, ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా వెయ్యి కోట్లతో తెరకెక్కుతుంది.
కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా 3000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ‘దంగల్ ‘ సినిమా పేరు మీద 1900 కోట్ల కలెక్షన్లను సాధించిందనే రికార్డ్ అయితే ఉంది. ఇక దాని తర్వాత బాహుబలి 2 1800 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది. కాబట్టి అమీర్ ఖాన్ సినిమా రికార్డ్ బ్రేక్ చేయాలి అంటే అది ఈ సినిమాతోనే సాధ్యమవుతుందని ప్రస్తుతం ఈ సినిమాని చాలా స్ట్రాంగ్ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే రాజమౌళి ఇండియాలోనే న్బర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు. ఇక పాన్ వరల్డ్ లో కూడా రాజమౌళికి చాలా మంచి క్రేజ్ దక్కుతుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలని సక్సెస్ ఫుల్ గా మార్చడానికి రాజమౌళి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…అయితే రాజమౌళి ఇంతకుముందు చేసిన త్రిబుల్ ఆర్ సినిమాతోనే ఈ రికార్డును బ్రేక్ చేయాలని చూశాడు. అయినప్పటికీ ఆ రికార్డు అనేది బ్రేక్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టి ముందుకు నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది…