Stambeswaranatha Temple: మన దేశం లో చారిత్రాత్మక ఆలయాలకు చాల ప్రాముఖ్యత ఉంది. ఒక్కో ఆలయానికి ఒక్కో విశేషం ఉంది. అలాగే ప్రతి ఆలయం కూడా స్థల పురాణం, ఘనమైన చరిత్ర కలిగి ఉన్నాయి. ఎన్నో విశిష్టతలు ఉన్న కొన్ని ఆలయాల గురించి మనలో చాలా మందికి తెలియదు అనే చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయే ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ ఆలయం గురించి కూడా ఎవరికి తెలిసి ఉండదు. ఈ ఆలయం గురించి తెలుసుకుంటే మీరు తప్పకుండ ఆశ్చర్యపోతారు. అలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో భావ్ నగర్ అనే ప్రాంతం ఉంది. అక్కడ కవీంకాంబోయి అనే గ్రామానికి అతి చేరువలో అరేబియా మహా సముద్రం ఉంటుంది. ఆ సముద్రం లో ఎన్నో విశిష్టతలు ఉన్న స్తంభేశ్వరనాథ ఆలయం ఉంది. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఆ ఆలయంలోకి వెళ్లలేము. ప్రతి రోజు మధ్యాన్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 .30 వరకు మాత్రమే ఆలయం లో దర్శనానికి అనుమతి ఇస్తారు. ఎందుకంటె మిగిలిన సమయం లో ఈ ఆలయం అరేబియా మహా సముద్రం లో మునిగి ఉంటుంది. ఈ విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోక మానరు. అందుకే ఈ ఆలయానికి స్తంభేశ్వరనాథ ఆలయం గా పేరు వచ్చింది. ఆలయం మొత్తం నీటిలో మునిగి ఉన్నప్పుడు శిఖరం, ధ్వజ స్తంభాలు మాత్రమే భక్తులకు కనిపిస్తాయి. అయితే ప్రతి రోజు కూడా మధ్యాన్నం 2 గంటల నుంచి 6 .30 వరకు మాత్రమే దర్శనానికి సమయం ఇస్తారని ఏమి ఉండదు. ఈ దర్శన సమయం ప్రతి రోజు ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఆలయం పైకి వచ్చి ఉంటుంది.
దాంతో ఉదయం కూడా దర్శించుకోవటానికి అనుమతి ఇస్తారు. ఒక్కోసారి మధ్యాన్నం సమయంలో కూడా ఆలయం మునిగి ఉంటుంది. అలాంటప్పుడు ఉదయం దర్శనానికి అనుమతి ఇస్తారు. ఇక ఏ సమయంలో ఆలయం మునిగి ఉంటుంది అని భక్తులకు ముందుగానే చిట్టీల ద్వారా తెలియజేస్తారు. దాంతో ఆ ఆలయానికి వెళ్ళాలి అనుకున్న భక్తులు ముందుగానే సమయం తెలుసుకొని వెళ్లి పూజ చేసుకొని ఆ సమయం ముగిసే ముందు గానే తిరిగి రావలసి ఉంటుంది. తీరం నుంచి ఏర్పాటు చేసిన తాడును పట్టుకొని ఆలయంలోకి వెళ్లి తిరిగి రావలసి ఉంటుంది.
ఈ ఆలయంలోకి వెళ్లడం రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఇక్కడి సిబ్బంది 70 ఏళ్ళు పై బడిన వారిని అలాగే 10 లోపు పిల్లలను అనుమతించరు. ఈ ఆలయంలో పూజారులు కూడా ఉండరు. అక్కడికి వెళ్లిన భక్తులే శివలింగానికి అభిషేకం చేసి పూలు సమర్పించాలి. లింగం నీటిలో మునిగిన తర్వాత ఆ పూలు బయటకు వచ్చేస్తాయి. అలా వచ్చిన పూలను భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ పూలు తమకు దొరికితే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అలాగే ఆ పూలను ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.