https://oktelugu.com/

period pain : పీరియడ్స్ నొప్పి నుంచి విముక్తి చెందాలంటే.. ఇది తినాల్సిందే!

అయితే పీరియడ్స్ సమయంలో బెల్లం తినడం వల్ల ఎక్కువగా రక్తస్రావం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఆ మూడు రోజులు కాకుండా డైలీ చిన్న ముక్కను తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమనని నిపుణులు అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 25, 2024 / 07:25 AM IST
    Follow us on

    period pain : పీరియడ్స్‌లో పొత్తికడుపులో నొప్పి అనేది సహజం. ఈ సమస్యతో ప్రతీ మహిళ తప్పనిసరిగా బాధపడుతుంది. నెలసరిలో వచ్చే ఈ కడుపు నొప్పిని భరించడం చాలా కష్టం. పీరియడ్స్‌లో రెండు నుంచి మూడు రోజుల వరకు ఈ నొప్పి ఉంటుంది. ఈ సమయంలో కేవలం కడుపు నొప్పి మాత్రమే కాకుండా నడుం నొప్పి, కాళ్లనొప్పి, నీరసం, అలసట, మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నెలసరిలో సాధారణమే. అయితే ఎక్కువ మంది బాగా ఇబ్బంది పడేతి కేవలం నొప్పితోనే. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మందులు వాడటం, చిట్కాలు పాటించడం వంటివి అన్ని కూడా చేస్తుంటారు. అయిన ఈ సమస్య తగ్గడం లేదా? అయితే ఈ చిట్కా పాటించండి. తీవ్రమైన నొప్పితో పీరియడ్స్‌ సమయంలో ఇబ్బంది పడుతుంటే.. తప్పనిసరిగా ఒక పదార్థం తినాల్సేందనని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థం ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గాలంటే తప్పకుండా బెల్లం మీ డైట్‌లో యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నొప్పిని తగ్గిస్తాయి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. బెల్లంలో ఉన్న ఔషధ గుణాలు ఉన్నాయి. ఎముకలను బలంగా చేయడంతో పాటు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కలిగించడంతో పాటు పొత్తి కడుపులో నొప్పిని తగ్గిస్తాయి. బెల్లంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి తగినంత శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే పీరియడ్స్ సమయంలో బెల్లం తినడం వల్ల ఎక్కువగా రక్తస్రావం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఆ మూడు రోజులు కాకుండా డైలీ చిన్న ముక్కను తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమనని నిపుణులు అంటున్నారు.

    బెల్లం నిరంతరాయంగా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ అవుతుంది. ముఖంపై ఉండే మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. రక్తపోటు రోగులకు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గ్లాసు అల్లం రసంలో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగిన కూడా పీరియడ్స్ నొప్పి తొలగిపోతుంది. వీటితో పాటు డార్క్ చాక్లెట్స్ తీసుకున్న పీరియడ్స్ నొప్పి తొలగిపోతుంది. అయితే పీరియడ్స్ నొప్పిని తట్టుకోలేక చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. ఇవి వాడటం అంతమంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నెలసరిలో మజ్జిగ, అల్లం రసం, పుదీనా టీ తాగిన కూడా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే దాల్చిన చెక్కను టీలో వాడటం, దాని పొడిని నీటిలో కలిపి తాగడం చేయాలి. లేదా డైరెక్ట్‌గా దాల్చిన చెక్కను తినడం వల్ల పీరియడ్స సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు అంటున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.