https://oktelugu.com/

Snake Island: అక్కడ దయ్యాలు లేవు.. భూతాలూ లేవు.. అందులోకి వెళ్తే ప్రాణాలతో ఉండరు..ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

చుట్టూ సముద్రం.. చేసింది విస్తారంగా చెట్లు.. అంతెత్తున రాళ్లు.. వాటి మధ్యన భూమి.. ఆ ప్రాంతం చూడ్డానికి బాగుంటుంది. ఆహ్లాదంగా ఉంటుంది. అలాగని అక్కడికి వెళితే ప్రాణాలతో బయట అడుగుపెట్టడం చాలా కష్టం.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 3, 2024 / 07:00 AM IST

    Snake Island

    Follow us on

    Snake Island: అట్లాంటిక్ మహాసముద్రం, బ్రెజిల్ తీరం మధ్య ఒక ద్వీపం ఉంటుంది. ఇది విస్తారంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలంటే ఓడలు లేదా బోట్లే ఆధారం. అలాగని అక్కడికి వెళ్తే ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. అక్కడ ఏమైనా దయ్యాలు ఉంటాయా? భూతాలు వేధిస్తాయా? అనే ప్రశ్నలు మీలో తలెత్తవచ్చు. కానీ అక్కడ దయ్యాలు లేవు. భూతాలు అంతకన్నా లేవు. మరి ఇంతకు అక్కడ ఏమైనా నరమాంసభక్షకులు ఉన్నారా? గ్రహాంతరవాసులు నివాసం ఉంటున్నారా? అనే ప్రశ్నలకు తావులేదు. అయితే అక్కడ పాములు నివాసం ఉంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4,30,000 వరకు పాములు ఉన్నాయి. అందువల్లే ఇక్కడకు ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా అందులోకి అడుగుపెట్టరు. 4,30,000 పాములలో గోల్డెన్ ప్లాన్స్ హెడ్ వైపర్ పాములు ఉన్నాయి. ఇవి సుమారు 5000 వరకు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఇవి. ఇవి కరిస్తే క్షణాలలోనే ప్రాణాలు పోతాయి. గతంలో ఈ ద్వీపం వద్దకు వెళ్లినవారు చనిపోయారు. అందువల్లే ఇక్కడికి ఎవరూ వెళ్ళకూడదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఆ ద్వీపానికి సమీప ప్రాంతంలో ఈ బోర్డులను ఏర్పాటు చేయడం విశేషం.

    పాములు ఎందుకలా..

    ఈ ద్వీపం సముద్రం సరిహద్దున ఉండడంతో.. కప్పలు, ఇతర జంతువులు అప్పుడప్పుడు అక్కడికి వస్తుంటాయి. వాటిని పాములు ఆహారంగా తీసుకుంటాయి.. అందువల్లే ఇక్కడ పాములు విస్తారంగా ఉంటాయి. పైగా ఇక్కడ మనుషుల అలికిడి లేకపోవడంతో.. వాటికి ప్రాణాపాయం లేదు. అవి నివసించడానికి అనువైన వాతావరణం ఉండడంవల్ల విశేషంగా పెరుగుతున్నాయి. అనేక రకాల పాములు ఇక్కడ ఉండడంతో… దీనిని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. గతంలో ఇక్కడికి కొంతమంది ఔత్సాహికులు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పాములను చూసి భయపడి వెనక్కి వచ్చారు. యానిమల్ ప్లానెట్ ఛానల్ కోసం కొంతమంది ప్రత్యేక దుస్తులు ధరించి అక్కడికి వెళ్లినప్పటికీ.. అక్కడ పాములు విస్తారంగా ఉండటంతో భయపడి షూట్ చేయకుండానే వచ్చేసారు. ప్రపంచంలో ఎంతో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి.. మరెన్నో ఎడారులు, శీతల ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఎక్కడ లేని విధంగా పాములు మాత్రం స్నేక్ ఐలాండ్లో మాత్రమే ఉన్నాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పేరుపొందింది. గతంలో ఓ సంస్థ ఇక్కడికి వెళ్లిన వారికి భారీగా ప్రైజ్ మనీ ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎవరూ వెళ్లడానికి సాహసం చేయలేదు. దీంతో ఆ సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇంకా అప్పటినుంచి ఈ ద్వీప ప్రాంతం పూర్తి నిషేధమైన జాబితాలో ఉండడం గమనార్ధం.