Neermahal: భారతదేశం ప్రాచీన కట్టడాలకు నిలయం. ఇక్కడ ఎన్నో సంస్కృతులు, చరిత్రను తెలిపే నిర్మాణాలు ఉన్నాయి. ఇవి వేల సంవత్సరాల క్రింద నిర్మింపబడి ఉన్నాయి. ఆచార, సాంప్రదాయాలకు అనుగుణంగా కొందరు.. చరిత్ర గురించి తెలిపే విధంగా మరికొందరు కట్టడాలను నిర్మించారు. వేల సంవత్సరాల కింద నిర్మించిన కొన్ని కట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఏ కట్టడమైన భూమి మీద మాత్రమే నిర్మించే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కట్టడాలు నీటిపై నిర్మించి అందరిని ఆశ్చర్యపరిచారు. భారతదేశానికి ఈశాన్యంలో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ఓ కట్టడం ప్రత్యేకంగా నిలుస్తుంది. నీటిపై తేలియాడినట్లు కనిపించే దీనిని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఇంతకు దీనిని ఎవరు నిర్మించారు? ఇది ఎక్కడ ఉంది?
Also Read: కడియం శ్రీహరి అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? రెవెన్యూ అధికారుల చర్యలతో కలకలం!
భారతదేశానికి ఈశాన్యం ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. ఈ రాష్ట్ర రాజధాని అగర్తలకు 50 కిలోమీటర్ల దూరంలో రుద్రసాగర్ అనే సరస్సు ఉంటుంది. ఈ సరస్సు మధ్యలో ఓ అందమైన భవనం నిర్మించారు. దీని పేరు ‘ నీర్ మహల్ ‘. ఇది పూర్తిగా నీటిపై తేలియాడినట్లే కనిపిస్తుంది. మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలని ఉద్దేశంతో.. నీటిపై కట్టడం నిర్మించాలని కోరికతో.. త్రిపుర మహారాజు బీర్ బి క్రమ్ బహదూర్ మాణిక్యం ఈ కట్టడాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి 9 ఏళ్ల సమయం పట్టిందని చరిత్ర తెలుపుతుంది. ఈ భవనంలో మొత్తం 24 గదులు ఉంటాయి. దీని చుట్టూ ఫౌంటెన్తో పాటు, మనసుకు ఉల్లాసాన్నిచ్చే చెట్లు ఉండి ఉద్యానవనంలా కనిపిస్తుంది. హిందువులతో పాటు, ముస్లింల సంస్కృతిని తెలిపే విధంగా దీనిని నిర్మించారు. రాత్రి సమయంలో ఈ కట్టడం ప్రతిబింబం నీటిపై పడుతుంది. ఆ సమయంలో ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం దీనిని చూసేందుకు చాలామంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. రాత్రి సమయంలో ఈ కట్టడాన్ని చూసేందుకు ఇక్కడే ఉంటున్నారు. స్థానికంగా పర్యాటకులు బస ఉండేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలో ఉన్న ఈ కట్టడం గురించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అయితే ఇది ఎన్నో సంవత్సరాల కింద నిర్మించినప్పటికీ దీని గురించి ఎక్కువగా ప్రచారం లేదు. నీర్ మహల్ గురించి తెలిసినవారు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సాధారణంగా నీటిపై ఏదైనా కట్టడాన్ని నిర్మించాలంటే చాలా కష్టతరమవుతుంది. అంతేకాకుండా నేలపై ఏదైనా భవనం నిర్మించాలంటే ఇసుక, కంకర, సిమెంట్ కావాల్సి ఉంటుంది. కానీ దీనిని కేవలం సున్నం, పాలరాయితో నిర్మించారు. దీంతో తెల్లటి ప్రతిబింబంలో కనిపించే దీనిని చూస్తే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడంతో నీటి మధ్యలో ఉండి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.