HomeతెలంగాణKadiyam Followers land scam: కడియం శ్రీహరి అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? రెవెన్యూ...

Kadiyam Followers land scam: కడియం శ్రీహరి అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? రెవెన్యూ అధికారుల చర్యలతో కలకలం!

Kadiyam Followers land scam: జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి అనుచరులు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డారని.. ఘన్ పూర్ ప్రాంతంలోని శివుని పెల్లి పరిధిలో సర్వే నెంబర్ లోని 46 లో ఉన్న 34 ఎకరాల భూమిని కడియం శ్రీహరి అనుచరులు కబ్జా చేశారని ఇటీవల మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. అంతేకాదు అధికారులకు సమాచారం కూడా అందించారు.

రాజయ్య ఈ భూ వ్యవహారంపై విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదని.. వారు ఏకంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని ఆరోపించారు. రాజయ్య ఆరోపణల తర్వాత గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కడియం శ్రీహరి అనుచరుల భూ బాగోతంపై ఆధారాలతో సహా ప్రచారం చేశారు. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది.. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ కావడంతో.. ఆదివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సతీష్, సర్వేయర్ నరేష్ క్షేత్రస్థాయికి వెళ్లారు. సర్వే నెంబర్ 46 లో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కడియం శ్రీహరి అనుచరులుగా చెబుతున్న వ్యక్తులు ఏర్పాటుచేసిన రాతి స్తంభాలను తొలగించారు.. ఆ తర్వాత హద్దులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ సతీష్, సర్వేయర్ నరేష్ పరిశీలించారు. ఈ సమయంలో కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే వారు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది..

Also Read: Kadiyam Srihari: కావ్య లేఖ రాస్తే.. కడియం శ్రీహరి తేనె తుట్టె కదిపాడు

కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు
ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్యే కొండా మురళి కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. కడియం శ్రీవారి పై మురళి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్నాడని, అన్యాయాలు చేస్తున్నాడని ఆయనపై విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసిన రెండు రోజుల్లోనే కడియం శ్రీహరి అనుచరుల భూ వ్యవహారం వెలుగులోకి రావడం విశేషం. అంతేకాదు ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడం విశేషం. అయితే వీటి వెనుక బలమైన శక్తి ఉందని.. అందువల్లే కడియం శ్రీహరి అనుచరుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సంఘటన తర్వాత కడియం శ్రీహరి ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే.. ఆ స్థాయిలో కబ్జా చేస్తుంటే అధికారులు ఇన్ని రోజులపాటు ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మీడియాలో వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆగమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular