Flaming Mountains: ప్లేమింగ్.. అంటే మండతున్న అర్థం.. పేరుకు తగినట్లుగా.. వాయవ్య చైనాలోని ఫ్లేమింగ్ పర్వతాల్లో 75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంత వేడిలో కూడా అక్కడికి వచ్చిన పార్యటకులు ఎంజాయ్ చేశారు. తీవ్ర ఎండలోనూ ఇసుకలో కాల్చిన గుడ్లను తిన్నారు. కొందరు ఐస్క్రీం తింటూ ఎంజాయ్ చేశారు. ఇంత వేడిలోనూ అక్కడ ఎలా ఉన్నారో తెలుసుకుందాం.
50 డిగ్రీలు దాటితేనే తట్టుకోలేం..
సాధారణంగా మన దేశంలో 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు వేసవి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ వేడినే మనం భరించలేకపోతున్నాం. కానీ వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్‌లో ఉన్న తుప్పాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫ్లేమింగ్ పర్వతాలు. ఈ పర్యవతాలపై పేరుకు తగినట్లుగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తాజగా మంగళవారం(జూన్ 11న) రికార్డు స్థాయిలో 75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భూమి నుంచి వేడివేడి పొగలు వసున్నప్పటికీ అక్కడికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
థర్మామీటర్ స్తంభంలో నమోదు..
ఇక పార్యటకులు ఎండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి టోపీలు ధరించారు. గొడుగులు పట్టుకున్నారు. ఇక పర్వతాలపై ఏర్పాటు చేసిన 12 మీటర్ల థర్మామీటర్ స్తంభంలో ఉష్ణోగ్రత 75 డిగ్రీ సెల్సియస్ నమోదైన దృశ్యాన్ని పర్యాటకులు గమనించారు. స్తంభంతో ఫొటోలు దిగారు. అక్కడే ఇసుకలో కాల్చి గుడ్డను పర్యాటకులు రుచి చూశారు. కొందరు ఐస్క్రీం తింటూ ఎంజాయ్ చేశారు.
మండుతున్న కొలిమిలో ఉన్నట్లు..
ఇక ఫ్లేమింగ్ పర్యవతాలపై ఉంటే.. మండుతున్న కొలిమిలో ఉన్నట్లు ఉందని ఓ పర్యాటకుడు తెలిపాడు. ఇలాంటి వాతావరణం మునుపెన్నడూ చూడలేదని పేర్కొన్నాడు. ఇది మరుపురాని అనుభూతి అని తెలిపారు. యాత్రికుల రక్షణ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాడు. కూలింగ్ ఫ్యాన్లు, ఐస్ కూలర్లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
పరిసర ప్రాంతాల్లో 45 డిగ్రీలు..
ఇక పర్వతం పరిసర ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయని పర్యాటక ప్రాంత నిర్వాహకులు తెలిపారు. ఇంత వేడిలోనూ పర్యాటకులు రావడం ఆనందంగా ఉందటున్నారు.