Cockroaches: ఈ భూమి మీద ఎన్నో రకాల జీవరాసులు కలిగి ఉన్నాయి. ప్రతి ఒక్కటి దేనికి అదే ప్రత్యేకమైనట్లుగా ఉంటుంది. మనుషులతో పాటు క్రిమి కీటకాలు, జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి ప్రాణంతోనే ఉండగలుగుతాయి. అన్ని జీవరాసులకు నీటితోపాటు గాలి అవసరం కూడా ఉంటుంది. అలాగే ఏ జీవి ప్రాణమైన తలలోనే ఉంటుంది. తల నుంచే వివిధ అవయవాలకు అవసరమైన సదుపాయాలు అందుతాయి. అందువల్ల తల లేకపోతే ఏ జీవి అయినా బతకదు. కానీ ఒకటి మాత్రం తల తెగినా కూడా కొన్ని రోజులపాటు జీవించగలుగుతుంది. దాని వివరాలు లోకి వెళ్తే..
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!
తల లేకుండా కొన్ని రోజులపాటు జీవించే ఈ జీవి ఎక్కడో అడవుల్లో కాదు.. మన ఇళ్లల్లోనే ఉంటుంది. అదేంటో కాదు బొద్దింక. దీనిని చూడగానే చాలామందికి భయం వేస్తుంటుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా కిచెన్లో ఉండడంవల్ల ఆడవారు దీనిని చూడగానే ఒరిగిపోతారు. బొద్దింక మనుషులకు నేరుగా ఇలాంటి హాని చేయకపోయినా ఇది ఆహార పదార్థాలను పాడుచేస్తుంది. వాటిని తినడం వల్ల మనసులు అనారోగ్యానికి గురవుతారు. అయితే ప్రస్తుత కాలంలో బొద్దింకలు తగ్గిపోయాయి. చాలామంది రసాయనాలు వాడి బొద్దింకలు లేకుండా చూస్తున్నారు.
అయితే బొద్దింక ప్రత్యేకమైన శరీరాన్ని కలిగి ఉంటుంది. బొద్దింక శరీరంపై మైనపు పూత వలె ఉంటుంది. దీనివల్ల శరీరంలోని తేమ తగ్గిపోకుండా కాపాడుతుంది. ఇదే సమయంలో బయట నుంచి గాలి పీల్చుకొని అవకాశం ఉంటుంది. దీంతో బద్దింకలోని తేమ త్వరగా ఆవిరైపోకుండా ఎక్కువకాలం జీవించగలుగుతుంది. బొద్దింక శరీరంలో బ్యాక్టీరియా సైట్స్ ఉంటాయి. వీటివల్ల ఇది బయట నుంచి ఎక్కువగా విటమిన్లు తీసుకోకపోయినా ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే శరీరంలోనే విటమిన్లను తయారు చేసుకుంటుంది. అలాగే బొద్దింక శరీరంలోని వ్యర్థాలను రీసైకిల్ చేసుకుంటుంది. దీంతో ఆహారం కోసం ఎదురుచూసే అవకాశం ఉండదు.
ఇక బొద్దింక గురించి మరో విశేషం ఏంటంటే దీని తల తెగినా కొన్ని రోజులపాటు జీవించగలుగుతుంది. మిగతా జీవుల వలే కాకుండా బొత్తింక వికేంద్రీకృత నాడీ వ్యవస్థను కలిగి ఉంటుంది. అందువల్ల తల లేకపోయినా రక్తప్రసరణ జరిగి బొద్దింక జీవించగలుగుతుంది. శరీర కదలికలు జరిగే న్యూట్రాన్లు శరీరమంతటా వ్యాపించి ఉంటాయి. దీంతో తల అవసరం లేకున్నా శరీరం కదులుతూ ఉంటుంది. బొద్దింక వల్ల నేరుగా నష్టం లేకపోయినా ఇది ఇండ్లలో ఉంటే మాత్రం ఆహార పదార్థాలు పాడైపోతాయి. అందువల్ల బొద్దింకలు లేకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బొద్దింకలు అనేక రకాలుగా ఉంటాయి. ఇవి గోధుమ రంగు తో పాటు ఎరుపు రంగులో కూడా కనిపిస్తాయి. వీటి సంతాన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువగా బొద్దింకలు ఉన్నప్పుడే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఒకరి ఇళ్లలో నుంచి మనం ఇళ్లలోకి వేగంగా వ్యాపిస్తాయి.