Pawan Kalyan latest look : జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ లుక్స్ అభిమానులను పిచ్చెక్కిస్తుంది. కుంభమేళా సమయంలో చూసిన పవన్ కళ్యాణ్ కి, ఇప్పటి పవన్ కళ్యాణ్ కి ఇంత తేడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కుంభమేళా సమయంలో బానపొట్ట , బూరె బుగ్గలు వేసుకొని చొక్కా లేకుండా స్నానం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు సైతం కంగుతిన్నారు. ఎలా ఉండే పవన్ కళ్యాణ్, ఎలా అయిపోయాడు అంటూ బాధపడ్డారు. ఇక దురాభిమానుల ట్రోల్స్ కి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆ ట్రోల్స్ ని డిఫెండ్ కూడా చేసుకోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏర్పడింది. ఆ స్థితి నుండి ఇప్పుడు 30 ఏళ్ళ కుర్రాడి లుక్స్ లోకి పవన్ కళ్యాణ్ రావడంపై అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తన కొత్త సినిమాల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ వర్కౌట్స్ చేసి ఇలా తయారయ్యాడని అంటున్నారు ఫ్యాన్స్. గత కొంతకాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్, నిన్న వైజాగ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ఇంత స్టైలిష్ లుక్స్ తో మా అభిమాన హీరో అదరగొడుతాడని ఎవ్వరూ ఊహించలేకపొయ్యాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నేడు ఆయన తమిళనాడు లో ‘మురుగన్ భక్త సమ్మేళనం’ కార్యక్రమం లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ తమిళనాడు స్టైల్ లో పంచెకట్టు కట్టి ఎంతో స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. విమానాశ్రయం లో ఆయన ఫ్లైట్ దిగి నడిచి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి.
అనంతరం ఆయన పలువురు ముఖ్యమైన బీజేపీ నాయకులను కలిసి, ఆ తర్వాత సమ్మేళనం కార్యక్రమానికి బయలుదేరాడు. ఇక్కడ తెల్లని చొక్కా,నుదిట అడ్డబొట్టు, పచ్చ రంగు లుంగీ ధరించి హాజరయ్యాడు. ఈ లుక్ కి కూడా ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో జరిగిన ఈ మహోత్సవం లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా యోగి ఆదిత్యనాధ్ పాల్గొన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అనేక వాయిదాల తర్వాత వచ్చే నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉన్నది. నిన్ననే ఈ విషయాన్ని ఒక సరికొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
మురుగన్ నేలపైన అడుగుపెట్టిన సనాతన ధర్మ పరిరక్షకుడు గౌ|| ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్ కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్… pic.twitter.com/OdxKn9BSPn
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2025