Burj Khalifa: ఈ ప్రపంచంలో ఎన్నో ఎత్తైన భవనాలు ఉన్నాయి. అందమైన ఆకారాలతో ఎంతో కొత్త డిజైన్లతో ఇంజినీర్లు వారి ప్రతిభను బిల్డింగ్ రూపాల్లో చూపిస్తున్నారు. కొత్త కొత్త ఆర్కిటెక్చర్‌తో బిల్డింగ్‌లను నిర్మించి ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఇండియాలో కూడా ఎన్నో ఎత్తయిన బిల్డింగ్‌లు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనం దుబాయ్‌లో ఉంది. దీనిని బుర్జ్ ఖలీఫా అని పిలుస్తారు. ఈ భవనాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు. చూడటానికి కనువిందులు చేసే ఈ బుర్జీ ఖలీఫా భవనం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మొత్తం 163 అంతస్తులు ఉండే ఈ భవనం దాదాపుగా 829.8 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ భవనాన్ని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. 2010లో ఈ బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) భవనాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ బిల్డింగ్‌లో ఎక్కువగా ధనవంతులు ఉంటారు. వారి సొంత ఇళ్లు, కార్యాలయాలు ఉంటాయి. దుబాయ్‌లో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ అయినా ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టింది. దీని వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మహమ్మద్ అలబ్బర్. అయితే చాలా పొడవుగా ఉండే ఈ బిల్డింగ్‌లో ఎక్కువగా రిచ్ కిడ్స్ ఉంటారు. మరి ఈ బిల్డింగ్‌లో ఉండాలంటే.. ఒక్కో ఫ్లాట్ (Flat) ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ బిల్డింగ్‌లో ఒక ఫ్లాట్ ఖరీదు ఎంతో చూద్దాం.
బుర్జ్ ఖలీఫా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఎంత దూరం నుంచి చూసిన చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందులో అర్మానీ హోటల్‌తో పాటు ఎన్నో విలాసవంతమైన 304 హోటళ్లు ఉన్నాయి. అలాగే ఈ బిల్డింగ్‌లో దాదాపుగా 900 నివాస అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇందులో నివసించాలంటే ఒక ఫ్లాట్‌కు ఎక్కువగానే అద్దె ఉంటుంది. అలాంటిది ఫ్లాట్ కొనాలంటే మాత్రం భారీగా చెల్లించాలి. ఈ బుర్జ్ ఖలీఫాలో సింగల్ బెడ్ రూమ్‌కు నెలకు దాదాపుగా 180,000 యూఏఈ దిర్హామ్‌లు చెల్లించాలి. అంటే భారతీయ కరెన్సీలో 41.99 లక్షల రూపాయలు అన్నమాట. అదే రెండు గదుల అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కి 300,000 యూఏఈ దిర్హామ్‌లు (భారతీయ కరెన్సీలో 69.99 లక్షల రూపాయలు, మూడు గదుల ఫ్లాట్‌కు 500,000 (భారత్ కరెన్సీలో 1.16 కోట్ల రూపాయలు) యూఏఈ దిర్హామ్‌లు ఖర్చవుతాయి. అయితే ఇదంతా ఏడాది అద్దె. అసలు అద్దె ఇంత ఉంటే.. ఒక ఫ్లాట్ ఖరీదు ఎంత ఉంటుందో మరి మీ ఉహాకే వదిలేస్తున్నా.
ప్రపంచంలో అత్యధిక సర్వీస్ ఎలివేటర్లు కూడా ఈ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్‌లోనే ఉన్నాయి. ఈ భవన నిర్మాణానికి ఎక్కువగా కాంక్రీట్ వాడారు. ఇది దాదాపుగా 100,000 ఏనుగుల బరువుకి సమానమట. ఇందులో వాడిన అల్యూమినియం దాదాపుగా ఐదు A380 విమానాల బరువుకు ఈక్వెల్ అంటా. ఇందులో ఉన్న లిఫ్ట్ 10 మీటర్ల వేగంతో వెళ్తుంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన లిఫ్ట్‌లలో ఇది ఒకటి. ఒకటి నుంచి 124వ అంతస్థుకు చేరుకోవడానికి కేవలం ఒక నిమిషం సమయం మాత్రమే పడుతుందట. ఈ బిల్డింగ్ నిర్మించడానికి దాదాపుగా ఆరేళ్ల సమయం పట్టిందట. ఈ బిల్డింగ్‌ను హైమెనోకాలిస్ ఫ్లవర్ లేదా స్పైడర్ లిల్లీ ఫ్లవర్ డి ఆకారంలో నిర్మించారని చెబుతుంటారు. చూడటానికి ఈ పువ్వులానే బుర్జ్ ఖలీఫా ఉంటుంది.