https://oktelugu.com/

Poland : పిజ్జాలు, బర్గర్లు తినే దేశం.. దోశల వెంట పడుతోంది.. ఆహా ఏమి రుచి అంటూ ఆరగిస్తోంది..

పిజ్జాలు తినే దేశం అది. బర్గర్లను అవలీలగా లాగించే కంట్రీ అది. కానీ ఇప్పుడు ఆ దేశం పూర్తిగా మారిపోయింది. కొత్త రుచిని కోరుకుంది. జిహ్వచాపల్యాన్ని దోశల ను ఆరగిస్తూ తీర్చుకుంటున్నది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 23, 2024 / 08:06 AM IST

    Poland

    Follow us on

    Poland :  మన ఇళ్లల్లో ప్రతిరోజు చేసే బ్రేక్ ఫాస్ట్ లలో దోశ కచ్చితంగా ఉంటుంది. అది కనక లేకపోతే ఏదో దోశం వంట ఇంటిని ఆవరించినట్టే. మినప, పెసర, రవ్వ, మిల్లెట్స్.. ఇలా ఎన్నో రకాల దోశలను తయారు చేసుకుంటున్నాం. దర్జాగా తినేస్తున్నాం. మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా దోశలు వేస్తుంటారు. దక్షిణాదిలో అయితే దోశలు తయారు చేసే విధానం ఒకరకంగా ఉంటుంది. ఉత్తరాదిలో మరో తీరుగా ఉంటుంది. ఇక ఇందులో ఉల్లి, ఉప్మా, మసాలా, పులిహోర, చికెన్, మటన్, ఎగ్, పన్నీర్, ఫిష్.. ఇలా చెప్పుకుంటూ పోతే దోశల వెరైటీల జాబితా చాంతాడంత ఉంటుంది.. అయితే ఇప్పుడు మన దేశస్తులే కాదు.. పోలాండ్ వాసులు కూడా దోశలను ఆశగా తింటున్నారు. పిజ్జాలకు, బర్గర్లకు బై బై చెప్పేసి దోశ ను తమ మెనులో చేర్చుకుంటున్నారు.

    భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం పోలాండ్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలైన దేశంలో 45కు పైగా భారతీయ రెస్టారెంట్లు దోశలను సర్వ్ చేస్తున్నాయి. పోలాండ్ దేశ రాజధాని వార్సా లో దాదాపు డజన్కుపైగా భారతీయ రెస్టారెంట్లు దోశ లను అక్కడి ప్రజలకు అందిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఆ రెస్టారెంట్లు టాప్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.. వార్సా నగరంలో చేతన్ నందాని అనే గుజరాతి వ్యాపారవేత్త.. ఇటీవల చాయ్వాలా అనే రెస్టారెంట్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆయన కర్రీ హౌస్ అనే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. వార్సా నగరంలో ఆయన స్ట్రీట్ ఫుడ్ చైన్ నిర్వహిస్తున్నారు. మనదేశంలో ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి నగరాలను సందర్శించిన పోలాండ్ వాసులు.. ఆ తర్వాత వారి స్వదేశానికి వెళ్ళిన అనంతరం స్ట్రీట్ ఫుడ్ రుచి చూస్తున్నారు. అందువల్లే భారత వ్యాపారులు ఇక్కడ స్ట్రీట్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. కేవలం మన ఫుడ్ మాత్రమే కాకుండా, సంస్కృతిని కూడా పోలాండ్ వాసులు ఇష్టపడుతున్నారు..” నేను పిజ్జా, బర్గర్ కు గుడ్ బై చెప్పేశాను. ప్రస్తుతం దోశను ఇష్టంగా తింటున్నాను. నేను కేరళ, తమిళనాడు చాలాసార్లు వెళ్లాను. అక్కడి రుచి, ఇక్కడి నుంచి ఒకే విధంగా ఉందని” పోలాండ్ దేశానికి చెందిన అన్నా మారియా రోజక్ పేర్కొన్నారు . కేవలం వార్సా మాత్రమే కాకుండా క్రాకో, రోక్లా వంటి నగరాలలోనూ భారతీయ రెస్టారెంట్లు వెలిశాయి. అక్కడి ప్రజలకు దోశలతో పాటు ఇతర వంటకాల రుచి చూపిస్తున్నాయి. సంస్కృతిని కూడా అలవడేలాగా చేస్తున్నాయి. చూడబోతే పోలాండ్ మరో భారత్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.