spot_img
Homeక్రైమ్‌Hyderabad Girls Pet Cat Story: పిల్లి కోసం ప్రాణాలు తీసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఆ...

Hyderabad Girls Pet Cat Story: పిల్లి కోసం ప్రాణాలు తీసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. ఆ కథేంటంటే?

Hyderabad Girls Pet Cat Story: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. అప్పుడే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాకాకుండా .. ప్రతి దానికి టెన్షన్ పడి.. ఒత్తిడికి గురైతే.. శరీరం మీద మనిషికి నియంత్రణ తగ్గిపోతుంది. క్షణకాలంలో జరగరాని ఘోరం జరిగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో నష్టం తీవ్రత అధికంగా ఉంటుంది.. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోతుంటాయి. అటువంటివే ఈ సంఘటనలు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ దారుణాలు సభ్య సమాజం మారుతున్న తీరును తేట తెల్లం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇద్దరు యువతులు పెంపుడు పిల్లుల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.. హైదరాబాద్ నగరంలో అల్వాల్ ప్రాంతంలో శ్రేష్ట అనే యువతి ఎంబీబీఎస్ చదువుతోంది.. ఈమెకు పిల్లులు అంటే చాలా ఇష్టం. తను ఒక పిల్లిని సాకుతోంది. అయితే ఆ పిల్లిని ఇంటికి తీసుకురావడం శ్రేష్ట తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ క్రమంలో శ్రేష్ట పిల్లిని ఇంటికి తీసుకొస్తే ఆమె తల్లి తిట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీంతో శ్రేష్ట ఆత్మహత్య చేసుకుంది.

ఇదే హైదరాబాదులోని మీర్పేట ప్రాంతంలో బిఎస్సి విద్యార్థిని హిమబిందు ఆత్మహత్య చేసుకుంది. ఈమె చనిపోవడానికి కారణం కూడా పిల్లే. ఈమె ఇష్టంగా సాగుతున్న పిల్లి చనిపోయింది. ఆ పిల్లి అనారోగ్యానికి గురి కావడంతో.. హిమబిందు ఆసుపత్రిలో చూపించింది. అయినప్పటికీ ఆ పిల్లి ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో.. ఆరోగ్యం విషమించి ఆ పిల్లి చనిపోయింది. పిల్లి చనిపోయిందనే బాధతో హిమబిందు ఆత్మహత్య చేసుకుంది.

ఇలా పెంపుడు జంతువుల మీద ప్రేమతో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వాస్తవానికి పెంపుడు జంతువులంటే ఎవరికైనా విపరీతమైన ఇష్టం ఉంటుంది. కానీ, ఆ ఇష్టాన్ని ఒక స్థాయి వరకు తీసుకెళ్లి.. చివరికి ప్రాణాల వరకు తెచ్చుకుంటే ఇదిగో ఇలాంటి ఘోరాలు జరుగుతుంటాయి. అందువల్ల పెంపుడు జంతువుల మీద ప్రేమను ఎక్కువగా పెంచుకోవద్దని.. దానిని ఒక స్థాయి వరకే పరిమితం చేసుకోవాలని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. అలా కాకుండా ఆ ప్రేమను మరింత పెంచుకుంటే ఇదిగో ఇలాంటి అనర్ధాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version