Site icon OkTelugu

Uttar Pradesh: భర్తను లేపేయడానికి భార్య స్కెచ్.. ఆ ప్లాన్ తెలిసి ఏం చేశాడో తెలుసా?

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: అనైతికం ఎప్పుడైనా ప్రమాదకరమే. అసలు అటువంటి వాటిని ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. అలవాటు పడకూడదు. కానీ నేటి కాలంలో అటువంటి బంధాలను చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లయిన వారు అటువంటి బంధాలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది పెళ్లి కాకముందే ఈ బంధాలకు అలవాటు పడి.. పెళ్లి చేసుకుని తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. పైగా అనైతికమైన వ్యక్తుల కోసం జీవిత భాగస్వాములను కడతేర్చుతున్నారు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

మనదేశంలో గత ఏడాది ఇండోర్ నగరంలో దారుణం వెలుగు చూసిన తర్వాత..ఆ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవాలంటేనే చాలామంది యువకులు భయపడుతున్నారు. ప్రియుళ్ళ తో కలిసి కట్టుకున్న వాళ్లను చంపేసే భార్యలు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. దీంతో చాలామంది భర్తలు తమ భార్యల ప్రవర్తన పై అనుమానం వస్తే.. ముందుగానే వదిలించుకుంటున్నారు. కలకాలం చస్తూ బతకడం కంటే.. వదిలేసుకోవడం నయం అని భావిస్తున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇదే ఉత్తమమైన మార్గమని వారు చెబుతున్నారు.

సిమెంట్ డ్రమ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహర్ అనే నగరంలో.. ఓ భార్య భర్తలు ఉన్నారు. ఇటీవల ఓ భర్త తన భార్య ఫోన్ లో.. మన ఫోటో చూశాడు. ఇందులో తన ఫోటోకు సిమెంట్ డ్రమ్ము అనే ఆప్షన్ చూసి భయపడిపోయాడు. దీంతో ఆమెను ప్రియుడి వద్దకు పంపించాడు. గత ఏడాది ఆ భార్య పుట్టింటికి వెళ్ళండి. ఆరు నెలల పాప ను భర్త వద్ద వదిలేసింది.. నెల పాటు ప్రియుడి వద్ద గడిపింది. దీనిపై అతడు నిలదీస్తే.. ఆధారాలు అడిగేది. ఇటీవల ఆమె ఫేస్ బుక్ చెక్ చేశాడు. తన హ*త్య కు కుట్ర చేస్తోందని అతడు గుర్తించాడు. అంతేకాదు, దీనిపై ఆమెను ప్రశ్నిస్తే.. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించేదని ఆ భర్త వాపోయాడు.

ఇటీవల కూడా ఈ తరహా సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్న నేపథ్యంలో.. పసిగట్టిన భర్త.. వెంటనే ఆమెను నిలదీశాడు. వారిద్దరు హోటల్ రూమ్ లో ఉండగా పోలీసుల సహాయంతో పట్టుకున్నాడు. ఆ తర్వాత తన ప్రాణానికి ఏమైనా ముప్పు వాటిల్లితే.. బాధ్యత తన భార్య, ఆమె ప్రియుడు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. ప్రాణాలను కాపాడుకొని భర్త హాయిగా బయటపడ్డాడు.

Exit mobile version