Site icon OkTelugu

Karimnagar SI case: రెండు రోజుల క్రితం భార్య.. ఇప్పుడు ఎస్సై ఆత్మహత్య.. అసలు వారి మధ్య ఏం జరిగింది?

Karimnagar SI case

Karimnagar SI case

Karimnagar SI case: కరీంనగర్‌ పోలీస్‌ శాఖలో కలకలం చేగింది. కరీంనగర్‌లో టూ టౌన్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ భార్య దివ్య రెండు రోజుల క్రితం గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకుంది. ఇది సంచలనంగా మారింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎస్సైపై విమర్శలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎస్సై చంద్రశేఖర్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసు కుటుంబాల్లో మానసిక ఒత్తిడి ఎలా పెరుగుతుందో ఇది ఒక హెచ్చరికగా మారింది.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

దివ్య ఆత్మహత్యతో విమర్శలు..
జిల్లాలోని ఇల్లందకుంట సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో చంద్రశేఖర్‌తో వివాహం జరిగింది. చంద్రశేఖర్‌ కుటుంబంతో కలిసి కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటున్నారు. టూ టౌన్‌ ఎస్సైగా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కడుపు నొప్పితో బాధపడుతున్న దివ్య మంగళవారం(మార్చి 17న)గన్నేరు పువ్వుల రసం తాగింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తండ్రి చిన్నసమ్మయ్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.

కుటుంబ కలహాలే కారణం..
దివ్యవ ఆత్మహత్యకు కడుపు నొప్పి కారణం కాదని తెలిసింది. ఈ విషయమై ఆమె తండ్రితో బలవంతంగా ఫిర్యాదు చేయించారని కుటుంబ సభ్యులు, బంధువులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్‌ తీరును తప్పు పడుతున్నారు. భర్త సరిగా చూసుకోలేదని, అనారోగ్యానికి తోడు భర్త వేధింపులు పెరిగాయని పేర్కొంటున్నారు. అందుకే భరించలేక బలవన్మరణానికి పాల్పడిందని సమచారం.

చంద్రశేఖర్‌పై ఒత్తిడి..
దివ్య ఆత్మహత్య తర్వాత చంద్రశేఖర్‌పై విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులుగా ఎస్సై కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. దివ్య మరణానికి సంబంధించిన ఆరోపణలు, కుటుంబ బంధువుల దాడి ప్రయత్నాలు చేశారని సమాచారం. ఈ పరిణామాలు ఆయనపై మానసిక భారాన్ని పెంచాయి. అంత్యక్రియల సమయంలో హై టెన్షన్‌ ఏర్పడటం ఈ ఒత్తిడిని తీవ్రతరం చేసింది. పోలీసు విధి ఒక్కటే కాకుండా కుటుంబ సమస్యలు కలిసి విషాదానికి దారితీసాయి.

అనాథలైన పిల్లలు..
పెళ్లయిన నాటి నుంచే దివ్యవ కొడుపు నొప్పితో బాధపడుతోంది. వైద్యం చేయించినా నయం కావడం లేదు. అయితే ఎస్సై చంద్రశేఖర్‌ భార్యను పట్టించుకోలేదని, మెరుగైన చికిత్స చేయించలేదని బంధువులు ఆరోపించారు. భార్య దివ్య కూడా అదే భావనతో మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు చంద్రశేఖర్‌ కూడా అదే విమర్శలు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో పిల్లలిద్దరూ ఆనాథలయ్యారు.

పోలీసులు రోజువారీ ఒత్తిడి, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. భారతదేశంలో పోలీసు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా కుటుంబ కలహాల వల్ల. కౌన్సెలింగ్, మద్దతు వ్యవస్థలు లేకపోవడం పరిస్థితిని దిగజార్చుతోంది. ఈ ఘటన ప్రభుత్వానికి సంకేతంగా మారాలి.

Exit mobile version