Site icon OkTelugu

Maruti Suzuki Ertiga mileage 45 km: 7 సీటర్ కారు.. 45 కిలోమీటర్ల మైలేజ్.. ఇంతకుమించి ఏదైనా కారు ఉందా?

Maruti Suzuki Ertiga mileage 45 km

Maruti Suzuki Ertiga mileage 45 km

Maruti Suzuki Ertiga mileage 45 km: కారు కొనాలని అనుకునేవారు ఇప్పుడు 7 సీటర్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి ఫ్యామిలీతో కలిసి దూర ప్రయాణాలు చేసేందుకు ఈ కారు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా కార్యాలయ అవసరాలకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ వేరియంట్ కారు ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా మైలేజ్ కూడా తక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ Maruti Suzuki కంపెనీకి చెందిన ఈ 7 సీటర్ కారు మాత్రం అత్యధిక మైలేజ్ ఇస్తూ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఆదరించిన ఈ కారు ఇప్పుడు అప్డేట్ తో రాబోతుంది. ఇంతకీ ఇది ఏ కారు? ఇందులో కొత్తగా కనిపించే ఫీచర్స్ ఏంటి?

Maruti Suzuki కంపెనీ నుంచి ఎన్నో రకాల మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కానీ 7 సీటర్ వేరియంటు లో Ertiga అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉండడంతో పాటు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులోనే ధర ను కలిగి ఉంది. అంతేకాకుండా బెస్ట్ మైలేజ్ ఇవ్వడంతో చాలామంది దీనిపై ఇంప్రెస్ చూపిస్తున్నారు. అయితే 2026 సంవత్సరంలో ఇది న్యూ లుక్ లో రాబోతుంది. ఈ కొత్త లుక్ లో భాగంగా హైబ్రిడ్ స్టైలిష్ డిజైన్ ను కలిగి ఉంటుంది. క్రోమ్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి టెయిల్ లాంప్స్ తో పాటు అల్లాయ్ వీల్స్ తో డిజైన్ అలరిస్తుంది. ఇంటి అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఈ కారు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో 1.5 లీటర్ హైబ్రిడ్ టెక్నాలజీతో కలిగిన ఇంజన్ ను అమర్చారు. ఈ ఇంజన్ 103 పవర్ ను అందిస్తుంది. అలాగే లీడర్ ఇంధనానికి 20 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. బలమైన హైబ్రి టెక్నాలజీతో కలిగిన ఈ కారు ఇంటీరియర్ లో కూడా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో విశాలమైన క్యాబిన్ ఉంటుంది. అలాగే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్, రియల్ ఏసి వెంట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుగుణంగా ఉంటుంది.

మారుతి ఎర్టిగా కారులో సేఫ్టీ కోసం కూడా ప్రత్యేకంగా ఫీచర్లను సెట్ చేశారు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్, హిల్ హోల్డ్ అసిస్టు, ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి సెక్యూరిటీని అందిస్తాయి. ఇందులో హైబ్రిడ్ ఇంజన్ ఉండడంతో డ్రైవర్లకు స్మూత్ డ్రైవింగ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ.10.99 లక్షల ప్రారంభం నుంచి..రూ.13.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

Exit mobile version